
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ నవంబర్ 22వ తేదీకి వాయిదా పడింది.ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం ( నవంబర్7) విచారణ జరిగింది.ఈ కేసులో బాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేయడంతో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. చంద్రబాబుకు ఇప్పటికే అనారోగ్య కారణాలతో బెయిల్‌పై ఉన్నందున విచారణ వాయిదా వేయాలని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం విజ్ఞప్తి చేశారు. చంద్రబాబుకు నవంబర్ 28వరకు మధ్యంతర బెయిల్ గడువు ఉన్నందున విచారణను వాయిదా 22వ తేదీకి వాయిదా వేశారు.
ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో చంద్రబాబును అరెస్ట్ చేయొద్దని గతంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏసీబీ కోర్ట్ విచారణ దశలో ఉన్న పీటీ వారెంట్‌పై హైకోర్టు స్టే విధించింది. తాజా విచారణలో చంద్రబాబు ఇప్పటికే మధ్యంతర బెయిల్‌పై ఉన్నందున విచారణ అవసరం లేదని వాయిదా వేయాలని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం విజ్ఞప్తి చేశారు.ఇదే సమయంలో చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై ఉన్న నేపథ్యంలో బెయిల్ గడువు పూర్తయ్యే వరకు ఎలాంటి అరెస్ట్ చేయబోమని సీఐడీ కోర్టుకు తెలియజేసింది.
ఏపీ రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుపై ఏపీ హైకోర్టు మంగళవారం ( నవంబర్ 7) విచారణ చేపట్టింది. తొలుత విచారణ చేపట్టిన హైకోర్టు కాస్త విరామం తీసుకుంది. అనంతరం మళ్లీ విచారణ చేపట్టింది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం కేసులో మధ్యంతర బెయిల్‌పై విడుదలైన విషయాన్ని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. చంద్రబాబు నారోగ్యంతో బాధపడుతున్నారని స్పష్టం చేశారు. ఇలాంటి తరుణంలో అరెస్ట్ చేయడం ఆయన ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించడమేనని కోర్టులో వాదించారు. అయితే చంద్రబాబును ఐఆర్ఆర్ కేసులో అరెస్ట్ చేయబోమని ఏజీ శ్రీరాం సుబ్రహ్మణ్యం వెల్లడించారు. చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం కేసులో మధ్యంతర బెయిల్‌పై ఉన్నారన్న విషయం తమకు తెలుసునన్నారు. మధ్యంతర బెయిల్‌పై ఉన్నందన అరెస్ట్ చేయబోమని ప్రకటించారు. మధ్యంతర బెయిల్ ఉత్తర్వుల స్ఫూర్తిని పాటిస్తామని ఏజీ శ్రీరాం సుబ్రహ్మణ్యం తెలిపారు. మధ్యంతర బెయిల్ గడువు పూర్తయ్యే వరకు చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయబోం అని ఏజీ శ్రీరాం సుబ్రహ్మణ్యం కోర్టుకు తెలియజేశారు. దీంతో ఇరువాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 22కు వాయిదా వేసింది.
ALSO READ : వైఎస్ఆర్ రైతు భరోసా నిధులు విడుదల... రైతుల ఖాతాల్లో డబ్బులు జమ