బెంగాల్‌‌‌‌లో సర్‌‌‌‌‌‌‌‌ ను సరిగ్గా అమలు చేయట్లే..సుభాష్‌‌‌‌ చంద్రబోస్‌‌‌‌ మనుమడు

బెంగాల్‌‌‌‌లో సర్‌‌‌‌‌‌‌‌ ను సరిగ్గా అమలు చేయట్లే..సుభాష్‌‌‌‌ చంద్రబోస్‌‌‌‌ మనుమడు
  • సుభాష్‌‌‌‌ చంద్రబోస్‌‌‌‌ మనుమడు చంద్రకుమార్‌‌‌‌‌‌‌‌ బోస్‌‌‌‌

కోల్‌‌‌‌కత్తా: పశ్చిమ బెంగాల్‌‌‌‌లో స్పెషల్‌‌‌‌ ఇన్‌‌‌‌టెన్సివ్‌‌‌‌ రివిజన్‌‌‌‌ (సర్‌‌‌‌‌‌‌‌) నిర్వహించడంపై నేతాజీ సుభాష్‌‌‌‌ చంద్రబోస్‌‌‌‌ మనుమడు చంద్రకుమార్‌‌‌‌‌‌‌‌ బోస్‌‌‌‌ తాజాగా స్పందించారు. బెంగాల్​లో సర్ నిర్వహించాలన్న ఉద్దేశం మంచిదే, అవసరమేనని అన్నారు. కానీ దాని అమలులోనే వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయని విమర్శించారు. ‘రాష్ట్రంలో సర్‌‌‌‌‌‌‌‌ నిర్వహణ ముఖ్యమైనదే.. కానీ, దానిని కండక్ట్‌‌‌‌ చేస్తున్న విధానం సరిగా లేదు. 

దీని వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంత త్వరగా దీనిని నిర్వహించేందుకు గల కారణం ఏంటో నాకు అర్థం కావడంలేదు. మా ఫ్యామిలీ కూడా సర్‌‌‌‌‌‌‌‌లో పాల్గొంది. అధికారులు అడిగిన అన్ని డాక్యుమెంట్స్‌‌‌‌ ఇచ్చాం. అయినప్పటికీ మమ్మల్ని విచారణకు పిలిచారు. లింకేజీలో సమస్య ఉందని పోల్‌‌‌‌ అధికారులు చెప్పారు. 

నన్ను విచారణకు పిలిచినందుకు నేనేమీ కంప్లైట్‌‌‌‌ చేయడం లేదు.. కానీ, ఈ ప్రక్రియ మొత్తం గందరగోళంగా ఉంది. ఇది ప్రజలను వేధించడం తప్ప మరేమీ లేదు” అని ఆయన అసహనం వ్యక్తం చేశారు.