
సీఎం కేసీఆర్పై మాజీ మంత్రి ఏ.చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ పైసలు ముఖ్యమంత్రి ఎక్కడ దాచారో కేంద్రం దగ్గర సమాచారం ఉందన్నారు. వికారాబాద్ ప్రాంతానికి ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా కేసీఆర్ అమలు చేయలేదన్నారు. ఏపీ సీఎం నీళ్ళు తరలించుకుపోతుంటే కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. సీఎం కేసీఆర్ వలనే దక్షిణ తెలంగాణ ఏడారిగా మారుతుందన్నారు. ఉచిత ఎరువులు ఇస్తామని చెప్పి రైతులను మోసం చేశారని మండిపడ్డారు.
ఉద్యమ దొంగలను పక్కన పెట్టుకుని కేసీఆర్ రాజ్యమేలుతున్నారని చంద్రశేఖర్ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం మాత్రమే ఉద్యమం చేస్తే తెలంగాణ రాలేదన్నారు. ఇళ్ళ నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన నిధులను కేసీఆర్ కుటుంబం దాచుకుందన్నారు. ఫాంహౌస్ లో పడుకునే కేసీఆర్ కు కేంద్ర పథకాలు గుర్తులేవన్నారు. బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ చేస్తోన్న దాడులకు కచ్చితంగా బదులు తీర్చుకుంటామన్నారు. ప్రధాని మోడీకి ముఖం చూపించే ధైర్యం లేకనే కేసీఆర్ నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందన్నారు.