
ఈనెల 22న చంద్రయాన్-2 ప్రయోగం
సోమవారం మధ్యాహ్నం 2.43 గం.కు నింగిలోకి
ఆదివారం సాయంత్రం 6.43గం.కు కౌంట్‌డౌన్
శ్రీహరి కోట- నెల్లూరు జిల్లా : ప్రతిష్టాత్మక ప్రయోగం చంద్రయాన్–2 కు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) డేట్ ఫిక్స్ చేసింది. ఈ నెల 22 సోమవారం రోజున.. మధ్యాహ్నం 2.43 గంటలకు జీఎస్‌ఎల్ మార్క్3–ఎం1 రాకెట్ ప్రయోగం చేయబోతున్నట్టు ఇస్రో తెలిపింది. 21, 22 తేదీలు అనుకూలంగా ఉన్నాయని చెప్పిన ఇస్రో.. 22న నింగిలోకి రాకెట్ ను పంపిస్తామని అధికారికంగా ప్రకటించింది. ప్రయోగానికి 20 గంటల ముందుగా అంటే.. ఆదివారం 6.43 గంటలకు కౌంట్‌డౌన్ మొదలవుతుంది.
జులై 15న తెల్లవారు జామున 2.51 గంటలకు చంద్రయాన్ 2 జరగాల్సింది. కానీ.. క్రయోజనిక్ ఇంజిన్ లో సమస్య వల్ల ప్రయోగం జరగలేదు. ప్రయోగానికి దాదాపు గంట సమయం ముందే రాకెట్ లాంచింగ్ నిలిపివేస్తున్నట్టు ఇస్రో ప్రకటించింది.