చంద్రునికి మస్తు దగ్గరగా… చంద్రయాన్ 2

చంద్రునికి మస్తు దగ్గరగా… చంద్రయాన్ 2

చంద్రుడికి 1412 కిలోమీటర్ల దూరంలో చంద్రయాన్​ – 2

చంద్రయాన్​ 2 చందమామ దగ్గరికి ఇంకా ఇంకా దగ్గరగా వెళ్లింది. ఇంకో 11 రోజుల్లో జాబిల్లిపై దిగేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. బుధవారం చంద్రయాన్​ 2 జాబిల్లి కక్ష్యను ఇస్రో మూడోసారి మార్చింది. చంద్రుడికి మరింత దగ్గరికి తీసుకెళ్లింది. చంద్రయాన్​ 2 కక్ష్య ఎత్తును 118 కిలోమీటర్ల నుంచి 179 కిలోమీటర్లకు పెంచిన ఇస్రో.. దూరాన్ని 4,412 కిలోమీటర్ల నుంచి 1,412 కిలోమీటర్లకు తగ్గించింది.

పొద్దున 9.04 గంటల ప్రాంతంలో 1190 సెకన్ల పాటు ఇంజన్లను మండించి చంద్రయాన్​ 2ను చందమామ దగ్గరకు తీసుకెళ్లింది. ప్రస్తుతం చంద్రయాన్​ 2 అంతా బాగానే పనిచేస్తోంది. శుక్రవారం సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య మరోసారి చంద్రయాన్​ 2 కక్ష్యలో మార్పులు చేయనుంది ఇస్రో.  సెప్టెంబర్​ 2న చంద్రయాన్​2ను చంద్రుడికి జస్ట్​ 30 కిలోమీటర్ల దూరానికి తీసుకెళుతుంది. ఆ తర్వాత ల్యాండింగ్​కు సంబంధించిన మార్పులను చేస్తుంది. సెప్టెంబర్​ 7న విక్రమ్​ ల్యాండర్​ను దించుతుంది.

వెలుగు మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి