హమారా ఇస్రో మహాన్ .. చంద్రయాన్ 2 ప్రయోగం సక్సెస్

హమారా ఇస్రో మహాన్ .. చంద్రయాన్ 2 ప్రయోగం సక్సెస్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ – ఇస్రో మరో అరుదైన ఘనత సొంతం చేసుకుంది. చంద్రయాన్ 2 ప్రయోగం సక్సెస్ అయింది. చందమామ జాడ కనుగొనే యాత్రలో భారత్ అద్భుతమైన విజయం సాధించింది.

చంద్రయాన్ 2 ప్రయోగం సక్సెస్ అయిందని ఇస్రో చైర్మన్ శివన్ ప్రకటించారు.

“జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్.. కచ్చితమైన కక్ష్యలో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టిందని చెప్పడానికి సంతోషిస్తున్నా. ఓ చరిత్రాత్మక ప్రయాణానికి ఇది నాంది. చంద్రుడి దక్షిణ ధ్రువంలో ఇంతవరకు ఎవరూ తేల్చని అంశాలను మనం తెల్సుకోబోతున్నాం. సాంకేతిక సమస్య వచ్చినా కూడా 24 గంటల్లోనే ఇస్రో బౌన్స్ బ్యాక్ అయి… అద్భుతమైన విజయం సాధించిందని చెప్పారు. సమస్య వచ్చిందని తెలిసిన తర్వాత 24 గంటల్లో సైంటిస్టులు చాలా కష్టపడ్డారని.. రోజున్నర వ్యవధిలోనే మళ్లీ శాటిలైట్ ను సిద్ధం చేశారని చెప్పారు. వారందరి వల్లే ఈ ఘనత సాధ్యమైందని చెప్పారు.