చంద్రయాన్ 3 ఫొటోలు : జాబిలా అంతా చదరంగానే ఉంది.. భూమిలాగే..

చంద్రయాన్ 3 ఫొటోలు : జాబిలా అంతా చదరంగానే ఉంది.. భూమిలాగే..

చంద్రయాన్ 3.. అద్భుతం అనే కంటే.. మహా అద్భుతంగా పని చేస్తుంది. ల్యాండింగ్ కు జస్ట్ ఒకే ఒక్క బటన్ దూరంలో ఉంది. ప్రస్తుతం చంద్రుడి ఉపరితలానికి 70 నుంచి 100 కిలోమీటర్ల దూరంలో తిరుగుతున్న చంద్రయాన్ 3.. చాలా చక్కగా పని చేస్తుందని ప్రకటించింది ఇస్రో. ఇప్పటి వరకు అనుకున్నది అనుకున్నట్లుగానే పని చేస్తూనే.. ల్యాండర్ నుంచి కొత్త ఫొటోలను పంపించింది చంద్రయాన్ 3 శాటిలైట్. చంద్రుడి దక్షిణ దృవంలో ల్యాండ్ కాబోయే చంద్రయాన్ 3 పంపించిన లేటెస్ట్ ఫొటోలు ప్రపంచాన్ని ఔరా అనిపిస్తున్నాయి.

చంద్రుడి దక్షిణ దృవం.. మన భూమిలాగే చదరంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సహజంగా చందమామను.. భూమి నుంచి చూస్తే పెద్ద లోయలు, కొండలు ఉన్నట్లు కనిపిస్తుంది. అందుకు భిన్నంగా చంద్రుడి దక్షిణ ధృవంలో మాత్రం చంద్రుడు ప్లాట్ గా.. అంటే చదరంగానే ఉన్నట్లు చంద్రయాన్ ఫొటోలు స్పష్టం చేస్తున్నాయి. అంతే కాదు.. చీకటిగా కూడా ఉంది.  చంద్రుడి దక్షిణ దృవంలోని ఉపరితలాన్ని చాలా దగ్గరగా ఫొటోలు తీసిన చంద్రయాన్ 3.. తన పనిని మొదలుపెట్టేసింది అనుకోవచ్చు. 70 నుంచి 100 కిలోమీటర్ల దూరంలో నుంచి ఎంతో క్లారిటీగా తీసిన ఫొటోలు.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి. గతంలో చంద్రయాన్ 2 ల్యాంగింగ్ సమయంలో పెద్ద లోయలో పడిందనే వార్తలు వచ్చాయి.. ఈ సారి అలా కాకుండా ఉపరితలం ఎక్కడ ప్లాట్ గా ఉందో ముందుగానే అంచనా వేసి.. ఆ ప్రాంతంలో ల్యాండ్ అయ్యే విధంగా చూస్తోంది ఇస్రో. ఈ క్రమంలోనే ఉపరితలానికి సంబంధించిన వేలాది ఫొటోలను చంద్రయాన్ 3 ద్వారా సేకరించి.. పరిశోధనలు చేస్తుంది ఇస్రో.

చంద్రుడి దక్షిణ దృవంలో ప్రయోగాలు చేస్తుంది ఇండియా, రష్యా మాత్రమే. ప్రస్తుతం చంద్రయాన్ ఆగస్ట్ 21వ తేదీ సాయంత్రం ల్యాండ్ కాబోతుండగా.. రష్యా ప్రయోగించిన లూనా 25 శాటిలైట్ 21వ తేదీనే ల్యాండ్ కావొచ్చని వార్తలు వస్తున్నాయి. ఎవరి శాటిలైట్ సాఫ్ట్ ల్యాండింగ్ అవుతున్నది అనేది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.