నైట్ కర్ఫ్యూతో మెట్రో, బస్ సర్వీసుల్లో మార్పులు

నైట్ కర్ఫ్యూతో మెట్రో, బస్ సర్వీసుల్లో మార్పులు

తెలంగాణలో ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించడంతో ప్రజా రవాణా సదుపాయాల్లో కూడా మార్పులు వచ్చాయి. ప్రభుత్వ నిర్ణయంతో హైదరాబాద్ మెట్రో కూడా ట్రైన్ సర్వీసుల్లో మార్పులు చేసింది. ఉదయం 6.30 గంటలకు మొదటి సర్వీస్‌ను ప్రారంభించే మెట్రో.. రాత్రి 7.45 గంటలకు చివరి సర్వీసును అందిస్తుంది. ప్రయాణికులు మెట్రో  సిబ్బందికి సహాకరించాలని.. ట్రైన్లలో భౌతిక దూరం పాటించడంతో పాటు.. మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలని మెట్రో అధికారులు సూచించారు. మెట్రో ఎక్కే వారందరికీ థర్మల్ స్క్రీనింగ్ చేయాలని అధికారులు నిర్ణయించారు. కర్ఫ్యూతో

ఇకపోతే నైట్ కర్ఫ్యూ ప్రభావం ఆర్టీసీ మీద కూడా పడింది. కర్ప్యూ కారణంగా బస్సులను రాత్రి నుంచి ఉదయం 5 వరకు సిటీ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది.