- లైసెన్స్, పేరు, అడ్రస్ మార్పులన్నీ చేసుకోవచ్చు
- 17 రకాల సర్వీసులను అందుబాటులోకి తెచ్చిన ఆర్టీఏ
- త్వరలో ‘నెక్స్ట్ జెన్ పరివర్తన్’లో కూడా..
హైదరాబాద్‌సిటీ, వెలుగు: వాహనాల లైసెన్సులు, ఇతర ఆర్టీఏ సేవలను మరింత పారదర్శకంగా అందించేందుకు అధికారులు ‘సారథి పోర్టల్’లో అనేక మార్పులు తీసుకువచ్చారు. ఆఫీసులకు వెళ్లే అవసరం లేకుండా సారథి మాడ్యుల్లో ఫేస్లెస్సేవలందిస్తున్నారు. ఇందులో భాగంగా ఆధార్ ఉంటే చాలు ఆఫీసులకు రాకుండానే ఆన్లైన్లోనే అన్ని సేవలు పొందొచ్చు.
ఏఏ సేవలంటే..
ప్రస్తుతం వాహనదారులు లర్నింగ్ లైసెన్స్‌తో పాటు పర్మినెంట్ లైసెన్స్‌ను సారథి పోర్టల్ ద్వారా పొందుతున్నారు. ఇప్పుడు వీటిని ఆధార్ ఉంటే ఫేస్‌లెస్ విధానంలో పొందే అవకాశాన్ని కల్పించారు. సారథి వెబ్‌సైట్‌లో లర్నర్ లైసెన్స్‌లో చిరునామా మార్పు, పేరు మార్పు, ఫొటో, సంతకం,డూప్లికేట్ లర్నర్ లైసెన్స్,లర్నర్ లైసెన్స్ ఎక్స్‌ట్రాక్ట్, డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ జారీ, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్, పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్‌లో అడ్రస్మార్పు, పేరు మార్పు, బయోమెట్రిక్ మార్పులు, పుట్టినతేదీ మార్పు, ఫొటో, సంతకం మార్పు, డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌ట్రాక్ట్, లైసెన్స్ నుంచి వాహన కేటగిరీ తొలగింపు, రవాణా వాహనాలు నడిపేందుకు ఎండోర్స్‌మెంట్, డూప్లికేట్ పబ్లిక్ సర్వీస్ వెహికల్ (పీఎస్వీ) బ్యాడ్జ్ జారీ వంటి సేవలన్నీ ఆఫీసులకు వెళ్లకుండానే సారథి పోర్టల్ ద్వారా పొందవచ్చని అధికారులు తెలిపారు. మరో వారం రోజుల్లో ఈ సేవలను నెక్స్ట్‌జెన్ పరివర్తన్ మోబైల్‌యాప్ ద్వారా కూడా అందుబాటులోకి తీసుకు రానున్నట్టు తెలిపారు.
ఎలా లాగిన్ కావాలంటే..
ఈ కొత్త విధానం ద్వారా కావాల్సిన సేవలు పొందాలంటే వాహనదారులు సారథి పోర్టల్‌లోకి వెళ్లి కావాల్సిన సర్వీసులను ఎంపిక చేసుకోవాలి. లెర్నింగ్, డ్రైవింగ్ లైసెన్స్నెంబర్,పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలను నమోదుచేయాలి. దీంతో పాటు ఆధార్వివరాలు కూడా ఇవ్వాలి. వెంటనే మొబైల్‌కు ఓటీపీ వస్తుంది.
ఆ తర్వాత ఫొటో, అవసరమైన డాక్యుమెంట్స్అప్లోడ్ చేయాలి. దరఖాస్తులు అందిన తర్వాత అధికారులు వాటిని పరిశీలించి ఆన్లైన్లోనే అప్రూవ్చేస్తారు. ట్రాన్స్పోర్ట్వెహికల్స్నడిపేవారు, ఆటో డ్రైవర్లు ఈ పోర్టల్ ద్వారా డుప్లికేట్సర్టిఫికెట్లను కూడా పొందే అవకాశం ఉంది.
