
టీఎస్ ఎంసెట్ ( TS EAMCET ) పరీక్ష షెడ్యూల్‌లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. మే 7 నుంచి 11 వరకు జరగాల్సిన ఎంసెట్ ఇంజినీరింగ్ ( Engineering Exams ) పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది.
మే 12, 13, 14 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. మే 10, 11 తేదీల్లో జరగాల్సిన ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. నీట్( NEET ), టీఎస్‌పీఎస్సీ( TSPSC ) పరీక్షల కారణంగానే ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు అధికారులు వెల్లడించారు.