మారుతున్న యంగ్ కన్జూమర్ల ఆలోచనలు

మారుతున్న యంగ్ కన్జూమర్ల ఆలోచనలు
  • లాంగ్ టెర్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం డబ్బులు పొదుపు చేసుకోవడం కంటే ఖర్చు చేయడానికి మొగ్గు

న్యూఢిల్లీ : దేశంలోని సగం మంది వినియోగ దారులు భవిష్యత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురించి ఆలోచించడం కంటే ఈ క్షణాన్ని ఎంజాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడం బెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అని భావిస్తున్నారు. మింటెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిపోర్ట్ ప్రకారం, 50 శాతం మంది ఇండియన్ షాపర్లు జీవితాన్ని ఇప్పుడే ఎంజాయ్ చేయాలని భావిస్తున్నారు. లాంగ్ టెర్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనాన్షియల్ ప్లానింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టడం లేదు. ఇటువంటి వినియోగదారుల్లో  యంగ్ జనరేషనే ఎక్కువగా ఉంది. సిటీల్లోని 68 శాతం మంది  యువత (మగవారు) పై విధంగా ఆలోచిస్తున్నారు. క్లాత్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, యాక్సెసరీలు కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వినియోగదారులు అలవాట్లు మారాయని మింటెల్ రిపోర్ట్ వెల్లడించింది.  

‘45 ఏళ్ల కంటే  పైనున్న వారు హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. చిన్న సిటీలలోని మహిళలు బ్యూటీ, పర్సనల్ కేర్ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను కొనుక్కోవడానికి ఎక్కువ డబ్బులు కేటాయిస్తున్నారు. యువత  ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎక్కువగా షాపింగ్ చేస్తున్నారు. కొత్త కొత్త బ్రాండ్లను ట్రై చేస్తున్నారు’ అని వివరించింది.  గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ పెరగడంతో వినియోగదారులు ఒత్తిడికి గురవుతున్నారని

అఫోర్డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధరల్లోని ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారని మింటెల్ ఇండియా సీనియర్ లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టైల్ ఎనలిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సప్తర్షి పేర్కొన్నారు.  దేశంలో సుమారు 11.6  కోట్ల మంది యువత ఉంటారని అంచనా. సిటీల్లోని కన్జూమర్లలో వీరి వాటా ఎక్కువగా ఉంది. కానీ, ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ పెరగడంతో 68 శాతం మంది యంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కన్జూమర్లు   ఫ్యాషన్ ఐటెమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై తక్కువ ఖర్చు చేయాలని ప్లాన్ చేస్తున్నారు.