ఇండిగోలో గందరగోళం కొనసాగుతోంది. సిబ్బంది కొరత కారణంగా బుధవారం పలు విమానాలు రద్దు చేసిన ఇండిగో సంస్థ గురువారం ( డిసెంబర్ 4 ) కూడా భారీ సంఖ్యలో విమానాలను రద్దు చేసినట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా వివిధ ఎయిర్ పోర్టుల నుంచి ఇండిగో విమానాలు రద్దు చేస్తున్నట్లు తెలిపింది సంస్థ. దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ అయినా ఇండిగో విమాన సర్వీసులకు ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ సహా ఇతర నగరాల్లో అంతరాయం కలిగింది. ఈ క్రమంలో వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకొని ఇబ్బంది పడ్డారు.
గురువారం తెల్లవారుజామున ఢిల్లీ నుంచి బయలుదేరాల్సిన 30కి పైగా ఇండిగో విమానాలు రద్దు చేసినట్లు తెలిపింది ఇండిగో. హైదరాబాద్ లో కూడా 33 విమానాలు రద్దు చేసినట్లు తెలిపింది ఇండిగో. ముంబై ఎయిర్ పోర్టులో నుంచి 170కి పైగా విమానాలు రద్దయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. బుధవారం ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, హైదరాబాద్ ఎయిర్ పోర్టుల నుంచి 200 విమానాలు రద్దు చేసినట్లు తెలిపింది ఇండిగో.
రోజుకు దాదాపు 2 వేల 200 విమానాలను నడుపుతున్న ఇండిగో సాంకేతిక లోపం కారణంగా పలు సర్వీసులు రద్దు చేయాల్సి వచ్చిందని.. ఇందుకు గాను కస్టమర్లకు హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపింది ఇండిగో.
హైదరాబాద్ కేంద్రంగా రద్దైన విమానాలు ఇవే..
హైదరాబాద్ కు రావాల్సిన విమానాలు:
- 5393 BOM → HYD
- 564 BOM → HYD
- 206 GOI → HYD
- 6337 AMD → HYD
- 351 PNQ → HYD
- 618 HYD → VTZ (Return arrival later)
- 352 PNQ → HYD
- 744 GOI → HYD
- 307 VTZ → HYD
- 6473 JDH → HYD
- 6881 GAU → HYD
- 886 BLR → HYD
- 537 BLR → HYD
- 514 ATQ → HYD
- 607 LKO → HYD
- 2179 BDQ → HYD
- 6709 CCU → HYD
- 6231 CJB → HYD
- 304 COK → HYD
- 626 VNS → HYD
- 6816 JDH → HYD
- 181 BLR → HYD
- 247 DEL → HYD
- 6215 MAA → HYD
- 6916 IDR → HYD
- 786 BOM → HYD
- 855 BLR →HYD
హైదరాబాద్ నుంచి బయలుదేరాల్సిన విమానాలు:
- 5245 HYD → BOM
- 972 HYD → GAU
- 743 HYD → GOI
- 6471 HYD → JDH
- 6927 HYD → AMD
- 6494 HYD → CCU
- 6360 BLR → HYD (return later)
- 608 HYD → LKO
- 495 HYD → ATQ
- 413 HYD → BLR
- 6361 HYD → BLR
- 6513 CCU → HYD (return later)
- 2052 DEL → HYD (return later)
- 180 HYD → BLR
- 6682 HYD → COK
- 849 HYD → DEL
- 6727 HYD → AMD
- 6271 HYD → CCU
- 944 HYD → CCU
- 6728 AMD → HYD (return later)
- 6232 HYD → CJB
- 307 HYD → VNS
- 6707 HYD → COK
- 297 HYD → JDH
- 6156 HYD → BLR
- 240 HYD → DEL
- 668 HYD → MAA
- 621 HYD → IDR
