పాల్వంచ, వెలుగు: మండలంలోని లక్ష్మీదేవిపల్లిలో ఉన్న ప్రభుత్వ జూని యర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మూతి చరణ్ అండర్ 19 విభాగంలో రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపికయ్యాడు.
జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబరిచిన చరణ్ రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం పట్ల జిల్లా క్రీడల అధికారి పరంధామరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గురువారం కోచ్ కళ్యాణ్ ను అభినందించారు.
