రైతుల కోసం తల నరుక్కునేందుకూ సిద్ధమే

V6 Velugu Posted on Sep 20, 2021

చండీగఢ్: పంజాబ్ కొత్త సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. రైతులకు కరెంటు, వాటర్ బిల్లులను మాఫీ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇకపై అన్నదాతలకు విద్యుత్‌‌తోపాటు నీళ్లను ఉచితంగా అందిస్తామన్నారు. పేదల పక్షాన ఉంటానన్న చరణ్‌జిత్.. ప్రజలకు సేవ చేసేందుకు కాంగ్రెస్ తనకు మంచి అవకాశం ఇచ్చిందన్నారు. 

కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని చరణ్‌జిత్ విజ్ఞప్తి చేశారు. రైతుల ప్రయోజనాలు కాపాడటం కోసం ఏం చేయడానికైనా సిద్ధమేనని, కావాలంటే తన తల నరుక్కునేందకు కూడా రెడీ అన్నారు. పార్టీ ఎమ్మెల్యేలతోపాటు స్టేట్ కాంగ్రెస్ చీఫ్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ, మాజీ సీఎం అమరిందర్ సింగ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పంజాబ్ ప్రజల బాగు కోసం అమరిందర్ సింగ్ ఎంతో కృషి చేశారని, ఆయన చేసిన మంచి పనులను ముందుకు తీసుకెళ్లడమే తన కర్తవ్యమని పేర్కొన్నారు.

Tagged Rahul Gandhi, water bills, electricity bills, Farmer\'s, Punjab CM Charanjit Singh Channi, Former CM Amarinder Singh

Latest Videos

Subscribe Now

More News