ఎయిర్‌‌‌‌‌‌‌‌ ఇండియా మాజీ సీఎండీపై ఛార్జ్‌‌‌‌షీట్‌‌‌‌

ఎయిర్‌‌‌‌‌‌‌‌ ఇండియా మాజీ సీఎండీపై ఛార్జ్‌‌‌‌షీట్‌‌‌‌

న్యూఢిల్లీ: సాఫ్ట్‌‌‌‌వేర్ సర్వీస్ డీల్‌‌‌‌ కుదుర్చుకోవడంలో అవతకవకలు జరిగాయని ఎయిర్‌‌‌‌‌‌‌‌ ఇండియా మాజీ సీఎండీ అర్వింద్‌‌‌‌ జాదవ్‌‌‌‌పై సీబీఐ ఛార్జ్‌‌‌‌షీట్ ఫైల్ చేసింది. ఆయనతో పాటు ఐబీఎం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌‌‌‌, ఎస్‌‌‌‌పీఏ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌‌‌‌, మరో ఆరు మందిపై ఐపీసీ సెక్షన్ 120 బీ (నేరం) కింద ఛార్జ్‌‌‌‌షీట్ ఫైల్ చేసింది. 2011 లో రూ.225 కోట్ల డీల్‌‌‌‌ ఎయిర్ ఇండియా, ఈ కంపెనీల మధ్య కుదిరింది.

సరైన టెండర్ ప్రాసెస్ ఫాలో కాకుండా జర్మనీ కంపెనీ ఎస్‌‌‌‌ఏపీ ఏజీకు  సాఫ్ట్‌‌‌‌వేర్ సర్వీస్‌‌‌‌ డీల్‌‌‌‌ను ఎయిర్‌‌‌‌ ఇండియా ఇచ్చిందని సీబీఐ పేర్కొంది. 2009, 2010 లో  ప్రైజెంటేషన్ ఇచ్చామని ఎయిర్‌‌‌‌‌‌‌‌ ఇండియా చెప్పినా, సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ నుంచి ఎటువంటి అనుమతులు లేవని వెల్లడించింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌‌‌‌ (సీవీసీ) రిపోర్ట్ ప్రకారం, సరియైన టెండర్ ప్రాసెస్‌‌‌‌ ఫాలో కాకుండా ఈ సాఫ్ట్‌‌‌‌వేర్ కాంట్రాక్ట్‌‌‌‌లను ఎయిర్‌‌‌‌‌‌‌‌ ఇండియా ఐబీఎం, ఎస్‌‌‌‌ఏపీకి ఇచ్చింది.