చార్జీల మోత.. రేట్ల వాత

చార్జీల మోత.. రేట్ల వాత
  • జనం గోస... ఇల్లు గడవక మధ్య తరగతి విలవిల
  • రోజూ పెట్రోల్​, డీజిల్​ రేట్ల బుగులు.. వ్యాట్​ తగ్గించని ప్రభుత్వం
  • సెస్​లు, రౌండప్ ​పేరిట ఇప్పటికే రెండుసార్లు బస్సు కిరాయిల వడ్డింపు
  • మరో 30 శాతం పెంచేందుకు ప్రపోజల్స్
  • ఏడు నెలల్లో రెండుసార్లు పెరిగిన రిజిస్ట్రేషన్​ చార్జీలు 
  • నేటి అర్ధరాత్రి నుంచి టోల్​ బాదుడు..  ఎల్లుండి నుంచి కరెంట్​ బిల్లుల దడ
  • భగ్గుమంటున్న నూనెల ధరలు

ఇప్పటికే  వంట నూనెల రేట్లు డబుల్​  అయినయ్​. బస్సు కిరాయిలు పెరిగినయ్​. రోజు రోజుకు పెట్రోల్​, డీజిల్​ రేట్లు పెరుగుతున్నయ్​. ఏప్రిల్​ ఒకటో తారీఖు నుంచి కరెంట్​ చార్జీల వడ్డింపు కూడా షురూ కానుంది. చార్జీల మోత, రేట్ల వాతతో సామాన్యులు పరేషాన్​  అయితున్నరు. ఏ వస్తువు ముట్టుకున్నా భగ్గుమంటున్నదని, ఏం పెట్టి కుటుంబాన్ని సాదుకోవాలని, ఎట్లా బతకాలని గోసవడుతున్నరు. 

హైదరాబాద్, వెలుగు: బైకు బయటకు తీయాలంటేనే సామాన్యుడు బుగులుపడుతున్నడు. కారణం.. రాష్ట్రంలో లీటర్‌‌‌‌‌‌‌‌ పెట్రోల్‌‌‌‌‌‌‌‌ రేటు రూ. 114 దాటేసింది!  సగటు ఇల్లాలు కూరలో కొసరి కొసరి నూనె పోస్తున్నది.. ఎందుకంటే లీటర్​వంట నూనె  రూ. 200 చేరింది! పెట్రోల్, డీజిల్, వంట నూనెల రేట్లే కాదు.. ఇంట్లో కరెంట్​చార్జీలు, రోడ్డెక్కితే టోల్​చార్జీలు, ఊరెళ్తే బస్సు కిరాయిలు, ఇల్లో, జాగో కొందామంటే పెరిగిన ల్యాండ్​వ్యాల్యూస్​, వాటికి  అడిషనల్​గా పెరిగిన రిజిస్ట్రేషన్​చార్జీలు.. ఇలా గడిచిన ఒకటి రెండు నెలల్లోనే అనూహ్యంగా పెరిగిన రేట్లు, చార్జీలు పబ్లిక్​కు చుక్కలు చూపిస్తున్నాయి. రెండేండ్ల పాటు కరోనా దెబ్బకు కుదేలై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టైంలో కనికరం చూపాల్సిన సర్కారే తమ జేబులకు చిల్లు పెడుతున్నదని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. 

అడ్డూ అదుపూ లేని ఆయిల్​ రేట్లు
రష్యా– ఉక్రెయిన్​ వార్​తో పెరిగిన వంట నూనెల రేట్లు ఇప్పటికీ దిగిరాలేదు. వ్యాపారులు సన్​ఫ్లవర్​, పామాయిల్​ బ్లాక్​చేయడంతో వాటితోపాటు పల్లి, ఇతర నూనెల రేట్లు పెరిగాయి. ముఖ్యంగా సన్​ఫ్లవర్​, పామాయిల్​ రేట్లు ఒకదశలో ఆల్​టైం రికార్డు స్థాయికి చేరుకున్నాయి. యుద్ధానికి ముందు వివిధ బ్రాండ్లకు చెందిన లీటర్​సన్​ఫ్లవర్​ఆయిల్ రిటైల్ మార్కెట్​లో  లీటర్​కు రూ.135 నుంచి రూ.140 దొరికాయి. యుద్ధం మొదలుకాగానే క్రమంగా పెరిగి రూ. 240 కి చేరుకున్నాయి. ఇటీవల యుద్ధ విరమణ సంకేతాలు వెలువడుతుండడంతో కాస్తా తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్​రిటైల్​ మార్కెట్​లో సన్​ ఫ్లవర్​ ఆయిల్​ రూ. 225 గా ఉంది. ఒకదశలో రూ.200కు చేరిన పామాయిల్​, పల్లి నూనెలు ప్రస్తుతం రూ. 175గా ఉన్నాయి. మొత్తం మీద ఒక్కో లీటర్​కు సగటున రూ. 50 పెరిగింది. 

దడపుట్టిస్తున్న కరెంటు చార్జీలు
రాష్ట్ర ప్రభుత్వం కరెంటు చార్జీలను కనీవినీ ఎరుగని రీతిలో పెంచేసింది. ప్రజలపై ఒకేసారి  రూ. 5,596 కోట్ల భారం మోపింది. ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ 1నుంచి చార్జీల బాదుడుతో కరెంటు బిల్లులు మోతమోగనున్నాయి. మే నెలలో వచ్చే బిల్లు చూసి సామాన్యులు గొల్లుమనే పరిస్థితి రానుంది. డొమెస్టిక్‌‌‌‌‌‌‌‌ కేటగిరీలో యూనిట్ కు 50 పైసలు, ఇతర కేటగిరీలకు రూపాయి చొప్పున పెంపునకు సర్కారు ఓకే చెప్పింది.  కరెంటు చార్జీలతో కొత్తగా ఫిక్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ చార్జీల పేరుతో రూ. 10, దీనికి తోడు కస్టమర్‌‌‌‌‌‌‌‌ చార్జీలు కూడా భారీగా పెంచేశారు. దీంతో రాష్ట్రంలో కోటి 54 లక్షల 91 వేల 171 మంది వినియోగదారుల్లో కుటీర పరిశ్రమలు, హెయిర్‌‌‌‌‌‌‌‌ కటింగ్‌‌‌‌‌‌‌‌, లాండ్రీషాపులు, అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ మినహా 1.19కోట్ల మంది వినియోగదారులపై భారం పడనుంది.  ఏటా ప్రత్యక్షంగా రూ.5,596 కోట్ల భారంతో పాటు ఫిక్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌  ఎనర్జీ చార్జీలు, కస్టమర్‌‌‌‌‌‌‌‌  చార్జీలు, నాన్‌‌‌‌‌‌‌‌ టెలిస్కోపిక్‌‌‌‌‌‌‌‌ విధానంతో మరో 5 వేల కోట్ల వరకు జనంపై సర్కారు భారం మోపనుంది. 

బస్సు కిరాయిల బాదుడు
ఆర్టీసీ సంస్థ బస్సు ప్రయాణికులపై చార్జీల మోత మోగిస్తున్నది. ఎలాంటి ముందస్తు ప్రకటన, హడావుడి లేకుండా పనికానిచ్చేస్తున్నది. డీజిల్‌‌‌‌‌‌‌‌ రేట్లను సాకుగా చూపుతూ  ప్యాసింజర్ల పై భారం మోపుతున్నది. మొదట పల్లెవెలుగు బస్సుల్లో రౌండ్‌‌‌‌‌‌‌‌ ఫిగర్‌‌‌‌‌‌‌‌ పేరుతో పెంపు షురూ చేసింది. టికెట్‌‌‌‌‌‌‌‌పై రూపాయి నుంచి రూ. 3 వరకు పెంచింది. తర్వాత సేఫ్టీ సెస్‌‌‌‌‌‌‌‌ అంటూ ఒక్కో టికెట్​పై రూపాయి వడ్డించడం మొదలుపెట్టింది. బస్సు ప్రమాదాల్లో ఎవరైనా చనిపోతే చెల్లించే పరిహారాన్ని జనం నుంచే రాబట్టాలనే ఈ సేఫ్టీ సెస్‌‌‌‌‌‌‌‌ తెచ్చినట్లు ప్రకటించింది. ఈ రేట్లను కూడా రౌండ్‌‌‌‌‌‌‌‌ ఫిగర్‌‌‌‌‌‌‌‌ పేరిట ఆఫీసర్లు మరోసారి సవరించారు. ఆ వెంటనే వివిధ రకాల బస్‌‌‌‌‌‌‌‌పాస్‌‌‌‌‌‌‌‌ల రేట్లు పెంచేశారు. ఒక్కో మంత్లీ పాస్‌‌‌‌‌‌‌‌పై బస్సు రకాన్ని బట్టి రూ. 200 నుంచి రూ. 500 దాకా వడ్డించారు. ఇక ఇటీవల ప్యాసింజర్‌‌‌‌‌‌‌‌ సెస్‌‌‌‌‌‌‌‌ పేరుతో మళ్లీ ఒక్కో టికెట్‌‌‌‌‌‌‌‌పై రూ. 5 బాదారు. దీనికి రౌండ్‌‌‌‌‌‌‌‌ ఫింగర్‌‌‌‌‌‌‌‌ యాడ్‌‌‌‌‌‌‌‌ చేశారు. మొత్తంగా బస్సు రకాన్ని బట్టి ఒక్కో టికెట్‌‌‌‌‌‌‌‌పై రూ. 10 నుంచి రూ.20 దాకా పెరిగింది. ఇక ఆర్టీసీ చార్జీలను 30శాతం వరకు పెంచాలంటూ సంస్థ పెట్టిన ప్రపోజల్స్​ సర్కారు వద్ద పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి.  ఒకవేళ ప్రభుత్వం వాటికి గ్రీన్‌‌‌‌‌‌‌‌ సిగ్నల్‌‌‌‌‌‌‌‌ ఇస్తే టికెట్‌‌‌‌‌‌‌‌ చార్జీలు ఇంకింత పెరగనున్నాయి. 

రిజిస్ట్రేషన్​ చార్జీలు తడిసిమోపెడు 
రాష్ట్ర ప్రభుత్వం ఏడు నెలల వ్యవధిలోనే మరోసారి రిజిస్ట్రేషన్​ చార్జీలు పెంచింది. దీంతో  సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇండ్లు, ఇండ్ల జాగలు కొనాలంటే ఒకటికి రెండుసార్లు  ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ చార్జీలతోపాటు పాటు భూములు, ఆస్తుల మార్కెట్‌‌‌‌‌‌‌‌ విలువ పెంచేశారు. అగ్రికల్చర్​ల్యాండ్స్​వాల్యూను కనిష్టంగా 50 శాతం, గరిష్టంగా150 శాతం పెంచారు. నాన్​ అగ్రికల్చర్​ఆస్తులకు సంబంధించి ఫ్లాట్ల విలువను 25 శాతానికి పైగా.. ఒపెన్​ ప్లాట్ల వాల్యూను 35 శాతం మేర పెంచారు. దీంతో మార్కెట్​ వాల్యూ గతంలో ఎకరాకు రూ. 5 లక్షలు ఉన్నచోట రూ.10 లక్షలకు చేరింది. దీని వల్ల సర్కారుకు రిజిస్ట్రేషన్​ ఆదాయం పెరిగింది. 

మండుతున్న పెట్రో ధరలు.. వ్యాట్​ తగ్గించని సర్కార్​ 
అంతర్జాతీయ పరిణామాలతో రోజురోజుకు పెట్రోల్‌‌‌‌‌‌‌‌, డీజిల్‌‌‌‌‌‌‌‌ రేట్లు మండిపోతున్నాయి. బుధవారం నాటికి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో లీటర్‌‌‌‌‌‌‌‌ పెట్రోల్‌‌‌‌‌‌‌‌ రూ. 114.52,  డీజిల్‌‌‌‌‌‌‌‌ రూ. 100.71 గా ఉన్నది. డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో లీటర్‌‌‌‌‌‌‌‌ పెట్రోల్‌‌‌‌‌‌‌‌పై రూ. 5, లీటరు డీజిల్‌‌‌‌‌‌‌‌పై రూ. 10 చొప్పున ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌ డ్యూటీని కేంద్రం తగ్గించింది. రాష్ట్రాలు కూడా తగ్గించాలన్న కేంద్రం సూచనల మేరకు పలు రాష్ట్రాలు లీటర్‌‌‌‌‌‌‌‌పై రూ. 3 నుంచి రూ. 7 వరకు తగ్గించాయి. కానీ తెలంగాణ సర్కారు మాత్రం ఒక్క పైసా కూడా తగ్గించలేదు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్​పై 35.2 శాతం, డీజిల్‌‌‌‌‌‌‌‌పై 27 శాతం వ్యాట్‌‌‌‌‌‌‌‌ వసూలు చేస్తున్నది. దేశంలో అత్యధిక వ్యాట్‌‌‌‌‌‌‌‌ను విధిస్తున్న రాష్ట్రం రాజస్థాన్‌‌‌‌‌‌‌‌ (36%) కాగా.. రెండో స్థానంలో తెలంగాణ ఉంది. ప్రస్తుతం పెట్రో రేట్లు పెరగడంతో ఆ ఎఫెక్ట్​ అన్ని రంగాలపై పడుతున్నది. ముఖ్యంగా అన్ని రకాల ట్రాన్స్​పోర్ట్​ చార్జీలు తద్వారా నిత్యావసరాల రేట్లు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. కూరగాయలు మొదలుకొని, కిరాణ సామాను వరకు రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. 

రోడ్డెక్కితే టోల్ బాదుడు
రాష్ట్రంలో ఓఆర్ ఆర్ తో పాటు అన్ని నేషనల్ హైవేల టోల్ గేట్ల దగ్గర చార్జీలను పెంచారు. టోల్ ప్లాజాల వారీగా రేట్లను ఖరారు చేస్తూ ఎన్ హెచ్ ఏ ఐ ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం అర్ధరాత్రి నుంచే కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి. వెహికల్ ను బట్టి కనిష్టంగా  రూ. 5, గరిష్టంగా రూ.50 వరకు పెరిగాయి. టోల్ గేట్ ఉన్న గ్రామ ప్రజలు తీసుకునే నెలవారీ పాస్​ల రేట్లను కూడా పెంచారు. డబుల్‌‌ ఎంట్రీకి కనిష్టంగా రూ. 10 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించారు.లైట్​ వేయాలంటే భయం ఏప్రిల్‌‌ 1నుంచి కరెంట్​ చార్జీల బాదుడు మొదలుకానుంది. డొమెస్టిక్‌‌ కేటగిరీలో యూనిట్ కు 50 పైసలు, ఇతర కేటగిరీలకు రూపాయి చొప్పున పెంచనున్నారు.

బస్సు టికెట్​ పెరిగింది.. 
ఇటీవల బస్సు రకాన్ని బట్టి ఒక్కో టికెట్‌‌పై రూ. 10 నుంచి రూ.20 దాకా పెంచారు. ఇంకా 30శాతం పెంచాలని సంస్థ  ప్రపోజల్స్ పెట్టింది.  

సిలిం‘డర్​’
వంట గ్యాస్​  ధర కూడా పెరుగుతూ పోతున్నది. 14 కిలోల సిలిండర్​పై  ఇటీవల రూ. 50 పెంచారు. మొత్తం మీద సిలిండర్​ రేట్​ వెయ్యి రూపాయలు దాటింది. నూనెల రేట్లు డబుల్​ రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి ముందు లీటర్​ సన్ ​ఫ్లవర్ ​ప్యాకెట్​ రూ.135. ఇప్పుడు రూ. 225.  పల్లి నూనె రూ. 175. రిజిస్ట్రేషన్​ చార్జీలు ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్‌‌ చార్జీలతోపాటు భూములు, ఆస్తుల మార్కెట్‌‌ విలువ పెంచారు. అగ్రికల్చర్​ ల్యాండ్స్​వ్యాల్యూను 50 శాతం నుంచి  150 శాతం వరకు పెంచారు.  

పెట్రోల్​, డీజిల్​ వాత
రోజురోజుకు పెట్రోల్‌‌, డీజిల్‌‌ రేట్లు పెరిగిపోతున్నాయి.  బుధవారం హైదరాబాద్‌‌లో లీటర్‌‌ పెట్రోల్‌‌ రూ. 114.52,  డీజిల్‌‌ రూ. 100.71.