క్రీజులో నుంచి కదలను..

క్రీజులో నుంచి కదలను..

భారత మహిళల జట్టుతో జరిగిన మూడో వన్డేలో దీప్తి శర్మ చేతిలో మన్కడింగ్ అయిన చార్లీ డీన్ ఎట్టకేలకు స్పందించింది. ఈ రనౌట్ను ఉద్దేశిస్తూ..ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఇకపై క్రీజులోనే ఉంటానని తెలిపింది. ప్రతీష్టాత్మక లార్డ్స్ లో  ఆడటం గౌరవంగా భావిస్తున్నాని చెప్పింది. ఈ మేరకు మూడో వన్డే ఫోటోలను షేర్ చేసిన చార్లీ డన్..వేసవికి ఆసక్తికర ముగింపు అని కామెంట్ చేసింది. 

బంతి పడకుండానే క్రీజు క్రాస్...
చివరి వన్డేలో చార్లీ డీన్ అనేక సార్లు బంతి పడకుండానే నాన్ స్ట్రైక్ ఎండలో క్రీజును వదిలి వెళ్లింది. దీన్ని దీప్తి శర్మ గమనించింది. అయితే అప్పటికే ఆమె చార్లీ డన్ ను హెచ్చరించింది. అంతేకాకుండా అంపైర్లకు వివరించింది. అయినా చార్లీ డీన్ లో మార్పు రాకపోవడంతో..దీప్తి శర్మ డీన్ ను రనౌట్ చేసింది. అయితే ఈ రనౌట్ చర్చకు దారితీసింది. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు, ప్రస్తుత క్రికెటర్లు క్రీడాస్పూర్తికి విరుద్దమంటూ మండిపడ్డారు. అయితే ఇది నిబంధనలకు విరుద్దంగా ఏమీ లేదని అనేక మంది మాజీ క్రికెటర్లు దీప్తి శర్మకు మద్దతుగా నిలిచారు. 

బాల్ వేయకముందే ఎలా వెళ్తుంది..?
రనౌట్ వివాదంపై దీప్తి శర్మ కూడా స్పందించింది. చార్లీ డీన్‌ అనేక సార్లు  బాల్ వేయకముందే ముందుకెళ్లిందని..ఎన్నిసార్లు హెచ్చరించినా ఆమె పట్టించుకోలేదని దీప్తి శర్మ వివరించింది. అందుకే ఆమెను రనౌట్ చేయాల్సి వచ్చిందని పేర్కొంది. ఈ విషయాన్ని అప్పటికే  అంపైర్లకు కూడా చెప్పామని తెలిపింది. 

ఎంసీసీ కీలక ప్రకటన..
రనౌట్ వివాదంపై క్రికెట్ చట్టాల సంరక్షకులైన మేరీల్‌బోన్ క్రికెట్ క్లబ్ కీలక ప్రకటన చేసింది. రనౌట్‌లో ఎలాంటి తప్పు లేదని స్పష్టం చేసింది. దీన్ని తప్పు చర్యగా చూడకూడదని చెప్పింది. చాలా మంది  క్రీడా స్ఫూర్తిని ఉల్లంఘనగా చూస్తున్నారని..అది సరైనది కాదని పేర్కొంది. నాన్స్ట్రైకర్ బౌలర్ బంతి వేయడానికి ముందే క్రీజును వీడితే అతనికి అదనపు ప్రయోజనం దక్కినట్లేనని తెలిపింది. నాన్ స్ట్రైకర్లు బౌలర్‌ను గమనించి..బ్యాట్స్మన్  రనప్ మొదలెడితే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కావు... అని ఎంసీసీ చెప్పింది.