
హీరో రామ్ పోతినేని, యాక్ట్రెస్ – ప్రొడ్యూసర్ చార్మి కౌర్.. ఓ ఫ్యాన్ చూపించిన అభిమానానికి కదిలిపోయారు. ఇస్మార్ట్ శంకర్ సినిమా విజయవంతం కావాలంటూ సందీప్ అనే అభిమాని… తిరుమల వేంకటేశుడిని దర్శించుకున్నారు. అందులో వింతేముందు అనుకుంటున్నారా… ఆ అభిమాని.. మెట్లమార్గంలో ఏడుకొండలను మోకాళ్లపై ఎక్కాడు. ఈ వీడియోను అభిమానులు కొందరు వీడియో తీసి… సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సంగతి తెలిసి హీరో రామ్, ప్రొడ్యూసర్ చార్మి మొదట షాక్ అయ్యారు. ఆ తర్వాత అభిమాని తమపై చూపించిన ప్రేమ.. కంటతడి పెట్టిస్తోందని చెప్పారు.
“సందీప్… నీ అభిమానానికి నాకు కన్నీళ్లొస్తున్నాయ్. దీనికి ధన్యవాదాలు చెప్పడం మాత్రమే సరిపోదు. ఇస్మార్ట్ శంకర్ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని ఏడుకొండలను మోకాళ్లపై ఎక్కడం అంత ఈజీకాదు. మాపై అంత ప్రేమ, అభిమానం చూపించినందుకు చాలా ధన్యవాదాలు” అని చార్మి చెప్పింది.
హీరో రామ్ ఎమోషనల్ గా స్పందించాడు. “డియరెస్ట్ సందీప్.. నీ వీడియో చూశాను. నువ్వు బాగానే ఉన్నావనుకుంటున్నా. నీ అభిమానం నా గుండెను తాకింది. నన్ను బాధపెట్టింది కూడా. అంతలోనే నాకు షాకిచ్చింది కూడా. ఇంతటి ప్రేమ, ఆప్యాయత, ప్రశంస దక్కించుకునేంతగా నేనేం చేశానో నాకు అర్థం కావడం లేదు. నీలాంటి అభిమానుల కోసమే నా గుండె కొట్టుకుంటోందని మాత్రం చెప్పగలను. ఎప్పటికీ నీకు కృతజ్ఞతలు.” అని రామ్ చెప్పాడు. దయచేసి ఇలాంటివి మరే అభిమాని కూడా చేయొద్దని విజ్ఞప్తిచేశాడు.
U got me tears Sandeep ????
Can’t thank u enough for this ????
Climbing all the way up to Tirumala on ur knees so that #ismartShankar becomes a blockbuster, ????
So much love n affection ?????? https://t.co/TH0AiGbrVL pic.twitter.com/oyvtmla3kG— Charmme Kaur (@Charmmeofficial) July 9, 2019
You know sometimes as actors when we feel that we don’t Deserve to be Trolled ..we need to understand that we don’t Deserve the kind of Extreme Love we get either.. #RAndoMthoughts https://t.co/d5eh4xeP5R pic.twitter.com/b2a2AIZKcc
— RAm POthineni (@ramsayz) July 9, 2019