వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి: ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి 

 వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి: ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి 

రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చార్మినార్ డివిజన్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ లోని చంద్రాయణగుట్ట, మహబూబ్ నగర్ చౌరస్తా దగ్గర ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్‌ చేయడం వల్ల వాహనాలు అదుపుతప్పి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. మరికొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 

ట్రాఫిక్ రూల్స్ పై వారం రోజులపాటు వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అప్పటికీ మాట వినకపోతే భారీగా జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. రాంగ్ రూట్ లో వస్తే 1700 రూపాయలు, ట్రిపుల్ రైడింగ్ చేస్తే రూ.1200 ఫైన్ వేస్తామన్నారు. నంబర్ ప్లేట్ లేకుండా  వాహనాలతో రోడ్లపై డ్రైవ్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.