
పార్టీ నేతల మధ్య ముదురుతున్న వివాదం
టికెట్ ఇవ్వకపోతే హస్తం పార్టీలో చేరేందుకు
రెడీగా ఉన్న చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్
హైదరాబాద్, వెలుగు: చార్మినార్ఎమ్మెల్యే, మజ్లిస్ పార్టీ సీనియర్ నేత ముంతాజ్ ఖాన్కాంగ్రెస్లో చేరడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఎంఐఎం నుంచి ఆయనకు చార్మినార్ టికెట్ వచ్చే అవకాశాలు కనిపించకపోవడంతో పార్టీ మారాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. తనకు, తన కొడుకు ఇంతియాజ్ఖాన్కు టికెట్లు ఇవ్వాలని ముంతాజ్ ఖాన్ కోరారని, కాంగ్రెస్‌నుంచి కూడా సానుకూల స్పందన వస్తున్నట్లు తెలుస్తోంది. ముంతాజ్‌ఖాన్ కాంగ్రెస్‌లో చేరితే ఆయనకు చార్మినార్, ఆయన కొడుకు ఇంతియాజ్‌కు యాకుత్‌పురా నుంచి పోటీకి అవకాశంకల్పిస్తామని కాంగ్రెస్ భరోసా ఇస్తున్నట్లు సమాచారం.
దీంతో ముంతాజ్‌ఖాన్.. మజ్లిస్ అధినేత అసదుద్దీన్, ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌తో ఏదో విషయం తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ముంతాజ్ ఖాన్ పార్టీలో చాలా సీనియర్ నేత. గతంలో సలావుద్దీన్ఓవైసీతోనూ కలిసి పని చేశారు. మజ్లిస్‌తో అమానుల్లాఖాన్ విభేదించి ఎంబీటీ పార్టీని ఏర్పాటు చేయడంతో ఆయనకు మద్దతుగా ముంతాజ్ ఉన్నారు. 1994లో ముంతాజ్‌ఖాన్ యాకుత్‌పురా నుంచి ఎంబీటీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత మళ్లీ మజ్లిస్‌లో చేరారు. ఐదు సార్లు యాకుత్‌పురా, చార్మినార్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
ఈసారి మజ్లిస్ పార్టీ తన సీనియారిటీని గౌరవించడం లేదనే అసంతృప్తితో ముంతాజ్ ఖాన్ ఉన్నారు. ఆయన కాంగ్రెస్‌లో చేరితే పాతబస్తీ రాజకీయాల్లో కీలక మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది.