యూనియన్ ఆఫీస్ లో అక్రమ ప్రవేశం.. పోలీసులకు బాధితుల ఫిర్యాదు

యూనియన్ ఆఫీస్ లో అక్రమ ప్రవేశం.. పోలీసులకు బాధితుల ఫిర్యాదు

హైదరాబాద్ సిటీ, వెలుగు: చార్మినార్ జోనల్ కార్యాలయంలోని భాగ్యనగర్ మున్సిపల్ జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆఫీసు తాళాలను భారతీయ మజ్దూర్ సంఘ్ గుర్తింపు పొందిన యూనియన్ తో పాటు  మరో యూనియన్ కు చెందిన నేతలు పగులకొట్టి అక్రమంగా ప్రవేశించడం వివాదాస్పదమైంది. 

మంగళవారం జరిగిన ఈ ఘటనపై జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు కే. ప్రకాశ్, జనరల్ సెక్రటరీ అశ్రఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆఫీసులో రూ.60 వేల నగదు, విలువైన డాక్యుమెంట్లు మాయమైనట్లు పేర్కొన్నారు. పోలీసులతోపాటు బల్దియా కమిషనర్ ఆర్వీ కర్ణన్, విజిలెన్స్ ఎస్పీకు కూడా ఫిర్యాదు చేసి, సదరు నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరామన్నారు.