
బుల్లితెర సీరియల్ నటి చారు అసోపా- రాజీవ్ సేన్ గతంలో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య మనస్పర్ధాలు రావడంతో ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. ఇందులోభాగంగానే గతేడాది డిసెంబరులో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ జంటకు కోర్టు విడాకులు మంజూరు చేసింది.
దీంతో రాజీవ్ సేన్, చారు అసోపా పిల్లి బంధం నుండి అధికారికంగా విడిపోయారు. అయితే వీరికి ఒక పాప ఉంది. విడిపోయాక పాపకోసం స్నేహపూర్వకంగా ఉన్నామని గతంలో వెల్లడించారు ఈ జంట. తాజాగా ఇదే విషయాన్ని రాజీవ్ తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు రాజీవ్ సేన్. "మేము వీడిపోయినా కుడా మా ప్రేమ అలాగే ఉంటుంది. మేము ఎల్లప్పుడూ మా పాపకు అమ్మ, నాన్నాలాగే ఉంటాం.' అంటూ పోస్ట్ చేశారు. అయితే ఈ విషయకపై చారు అసోపా మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.