నిత్యానంద గురించి నిజాలు చెప్పిన చాట్జీపీటీ

నిత్యానంద గురించి నిజాలు చెప్పిన చాట్జీపీటీ

అత్యాచారంతో పాటు పలు కేసుల్లో నిందితుడైన నిత్యానంద భారత్ నుంచి పారిపోయి తను కొనుగోలు చేసిన ఓ ద్వీపాన్ని  కైలాస అనే దేశంగా ప్రకటించుకున్నాడు. ఇటీవల జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో ఆ దేశ ప్రతినిధి మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ అయ్యాయి. నిత్యానంద‌, కైలాస దేశం గురించి ఏఐ చాట్‌బాట్ చాట్ జీపీటీని అడిగితే ఏం చెప్తుందంటే..

‘నిత్యానంద ధ్యానపీఠం సంస్థ వ్యవస్థాపకుడు. వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు. 1977లో తమిళనాడులో జన్మించాడు. తను జ్ఞానవంతుడు. హిందూ మతం, బౌద్ధం, నవయుగ ఆధ్యాత్మికతను బోధిస్తాడు. 2010లో జరిగిన అత్యాచారం కేసులో బెయిల్ పొంది కేలాస ద్వీపానికి చేరుకున్నాడ’ని  చాట్ జీపీటీ త‌న స‌మాధానంలో తెలిపింది. నిత్యానంద అభిప్రాయం ప్రకారం కైలాస అనేది సనాతన హిందూ ధర్మ పురాతన జ్ఞానోదయ హిందూ నాగరికత పునరుజ్జీవనం చేసే దేశమని ఆ దేశం గురించి చెప్పుకొచ్చింది. 

కైలాస సార్వభౌమ దేశం కాదని, ఆ దేశానికి ఎటువంటి అధికారిక సరిహద్దులు, వీసా విధానాలు లేవని చాట్ జీపీటీ తెలిపింది.  కైలాస దేశానికి వెళ్లడం మంచిది కాదని, ఇది మిమ్మల్ని చట్టపరమైన, వ్యక్తిగత ప్రమాదంలో పడేస్తుందని చాట్ బాట్ హెచ్చరించింది. కైలాస బృందం ప్రతినిధులకు ఐరాసలో పాల్గొనే హక్కు లేదని కూడా చాటా జీపీటీ పేర్కొంది.