చాట్ జీపీటీ సమాధానంపై మస్క్ వెరైటీ రిప్లై

చాట్ జీపీటీ సమాధానంపై మస్క్ వెరైటీ రిప్లై

టెక్నాలజీ రంగంలో సంచలనంగా మారిన చాట్ జీపీటీ ప్రస్తుతం హాట్‍టాపిక్‍గా మారింది. తాజాగా ఎలాన్ మస్క్ గురించి చాట్ జీపీటీ చెప్పిన సమాధానం విని, ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల ఓ ట్విట్టర్ యూజర్ ట్వి్ట్టర్ అధినేత ఎలాన్ మస్క్ గురించి అడగగా.. చాట్ జీపీటీ ఓ షాకింగ్ సమాధానమిచ్చింది. ఎలాన్ మస్క్, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్, బోరిస్ జాన్సన్, నటి కిమ్ కర్ధాషియన్, రష్యా అధ్యక్షుడు పుతిన్ వంటి వాళ్లను కాంట్రవర్సియల్( వివాదాస్పద) వ్యక్తులుగా చాట్ జీపీటీ పేర్కొంది. దాంతో ఈ వ్యక్తులను ప్రత్యేకంగా పరిగణించాలని కూడా స్పష్టం చేసింది. అమెరికా జో బైడెన్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ లు కాకుండా.. డొనాల్డ్ ట్రంప్, మస్క్ లను ప్రత్యేకమైన వ్యక్తులుగా పరిగణించవచ్చని చాట్ జీపీటీ పేర్కొంది. ఈ వివరాలను ఐజాక్ అనే ట్విట్టర్ యూజర్ ట్వీట్ చేయగా.. మస్క్ వెరైటీగా స్పందించారు. ఆశ్చర్యానికి గురవుతున్నట్టుగా రెండు ఆశ్చర్యార్థక సింబల్స్ (!!) ను మస్క్ పోస్ట్ చేశారు. మస్క్ ఇచ్చిన స్పందనపై నెటిజన్లు కూడా రియాక్ట్ అవుతున్నారు. పత్రికలు, మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగానే చాట్ జీపీటీ సమాధానాలు ఇస్తోందని చెబుతున్నారు.