
‘ఆర్ఆర్ఆర్’ హిందీ రీమేక్‌పై చాట్‌జీపీటీ ఇచ్చిన సమాధానం వైరల్ అవుతోంది. ఈ సినిమాను బాలీవుడ్లో తీస్తే రాంచరణ్ రోల్‌కు రణ్‌వీర్‌సింగ్, సిద్ధార్థ్ మల్హోత్ర వంటి హీరోలు బాగుంటారని తెలిపింది. ఎన్టీఆర్ రోల్ కోసం విక్కీ కౌశల్, రాజ్‌కుమార్ రావు బాగా సెట్ అవుతారని తెలిపింది.
ఆలియా చేసిన సీత పాత్రకు కృతి సనన్, శ్రద్ధాకపూర్‌లను సూచించింది. ఇక దర్శకుడిగా రాజమౌళి స్థానంలో సంజయ్ లీలా భన్సాలీని ఎంపిక చేసింది. అజయ్ దేవ్‌గణ్, శ్రియ రోల్స్ కోసం సంజయ్‌దత్, దీపికా పడుకునేలను ఎంపిక చేసుకోవచ్చని చాట్‌జీపీటీ సమాధానం ఇచ్చింది.