అమ్మాయిలా చాటింగ్ చేసి.. 70 మందిని మోసం చేసిన యువకుడు

అమ్మాయిలా చాటింగ్ చేసి.. 70 మందిని మోసం చేసిన యువకుడు

హైదరాబాద్: ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ప్రొఫైల్‌తో అమ్మాయిలా ఛాటింగ్ చేసి 70 మంది అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసిన సుమంత్ అనే యువకుడ్ని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.  ఎప్పటి  నుంచి ఇలా ఛీటింగ్ చేస్తున్నాడు… వేరే అకౌంట్లు ఏమైనా ఉన్నాయా..? వేరే ప్రొఫైల్‌లు, వేరే అకౌంట్ల ద్వారా ఇంకా ఎంత మందిని.. ఎవరెవరిని మోసం చేశాడో తెలుసుకునే పనిలో పడ్డారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఇతని బ్లాక్ మెయిల్ వేధింపులు భరించలేక ఓ బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇతని ఆగడాలకు చెక్ పడింది. విజయవాడకు చెందిన సుమంత్ హైదరాబాద్‌లో అమెజాన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. మణికొండలో నివాసం ఉంటూ అమెజాన్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. డ్యూటీ అయ్యాక.. ఇంస్టాగ్రామ్ అకౌంట్‌లో అమ్మాయిలా మారిపోతాడు. ఇంటర్నెట్‌లో డౌన్లోడ్ చేసుకున్న అందమైన అమ్మాయి ఫోటోతో ప్రొఫైల్ తయారు చేస్తాడు. అమ్మాయి మాదిరిగా వాళ్ళతో చాటింగ్ చేస్తాడు.. అమ్మాయే కదా అని అవతల వాళ్లు కూడా ఇతనితో క్లోజ్‌గా.. అన్ని విషయాలు ఓపెన్ గా ఛాటింగ్ చేసేలా రెచ్చగొడతాడు. ఇతని మాయలోపడ్డాక మెల్లగా అసభ్యకరమైన ఫోటోలు తెప్పించుకోవడం మొదలుపెడతాడు. ఇతని తీయని మాటలను నమ్మి తాము ఒంటరిగా ఉన్నప్పుడు, అశ్లీలంగా ఉన్న ఫోటోలు పంపించిన అమ్మాయిల ఆర్ధిక పరిస్థితి తెలుసుకుని బ్లాక్ మెయిల్ మొదలుపెడతాడు. ఇప్పటి వరకు దాదాపు 70 మంది అమ్మాయిలను సుమంత్ బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు గుర్తించారు. ఇంత మంది ఇతనితో ఇబ్బందిపడుతున్నా.. కేవలం ఒక్క అమ్మాయి మాత్రమే ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బ్లాక్ బెయిలర్ బండారం బయటపడింది. మిగిలిన బాధితులు కూడా ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయడంతోపాటు.. వివరాలు సమర్పిస్తే.. మోసగాడి ఉదంతాలన్నీ బయటకొచ్చే అవకాశం ఉందంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు.

For More News..

లైసెన్స్‌‌‌‌‌‌‌‌ లేని వాళ్లకు బండిస్తే రూ. 5 వేలు ఫైన్

పోతిరెడ్డిపాడు పక్కనే రాయలసీమ లిఫ్ట్‌

ఎలక్ట్రిక్‌‌ బైకులకు నో ట్యాక్స్‌‌, నో రిజిస్ట్రేషన్‌‌ ఫీజు

సంపూర్ణ అక్షరాస్యత ఊసేలేదు.. నీతి ఆయోగ్ పదేపదే అలర్ట్ చేసినా పట్టించుకోలేదు