ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్ ..ఇద్దరు జవాన్లకు గాయాలు

ఛత్తీస్ గఢ్ లో  ఎన్ కౌంటర్ ..ఇద్దరు జవాన్లకు గాయాలు

భద్రాచలం, వెలుగు: ఛత్తీస్​గఢ్​ రాష్ట్రంలోని బీజాపూర్​ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్​కౌంటర్​లో మావోయిస్టులు తప్పించుకోగా, ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. గంగులూరు అడవుల్లో మావోయిస్టులు సమావేశమైనట్లు తెలుసుకున్న బీజాపూర్​ పోలీస్​ ఆఫీసర్లు డీఆర్జీ బలగాలను రంగంలోకి దించారు. 

కూంబింగ్​ జరుపుతుండగా, మావోయిస్టులు కాల్పులు ప్రారంభించడంతో ఇద్దరు జవాన్లకు తీవ్రగాయాలయ్యాయి. వారిని వెంటనే హెలికాప్టర్​ ద్వారా బీజాపూర్​కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం రాయ్​పూర్​కు తీసుకెళ్లారు. వారి పరిస్థితి మెరుగ్గానే ఉందని బీజాపూర్​ పోలీసులు తెలిపారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం అదనపు బలగాలతో కూంబింగ్​ కొనసాగిస్తున్నారు.