
ఇంద్రా రామ్, పాయల్ రాధాకృష్ణ జంటగా నిఖిల్ గొల్లమారి దర్శకత్వంలో త్రినాథరావు నక్కిన నిర్మించిన మూవీ ‘చౌర్య పాఠం’. వి. చూడమణి కో ప్రొడ్యూసర్. 2025 ఏప్రిల్ 25న థియేటర్స్లో సినిమా విడులైంది.
మిరాయ్ డైరెక్టర్, టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమేని కథను అందించారు. ఈ మూవీ 2025 ఏప్రిల్ 25న థియేటర్స్ లో విడుదలై ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది. కాన్సెప్ట్ బాగున్నా కామెడీ, ట్విస్ట్‌లు అనుకున్న స్థాయిలో వర్కవుట్ కాకపోవడంతో ఓ మోస్తరు వసూళ్లను రాబట్టింది. దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా నిలిచింది. అయితే, ఇటీవలే ఓటీటీలోకి వచ్చి దుమ్ములేపుతోంది.
చౌర్య పాఠం ఓటీటీ:
తెలుగు క్రైమ్ కామెడీగా తెరకెక్కిన ఈ మూవీ ఇటీవలే అమెజాన్ ప్రైమ్‌లో రిలీజయింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా స్ట్రీమ్ అవుతోంది. అయితే, రిలీజైన అన్ని భాషల్లోనూ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుంది. దాంతో ఈ మూవీ ప్రైమ్ వీడియోలో టాప్ టెన్ ట్రెండింగ్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది.
తెలుగు ఆడియన్స్ ఈ సినిమాను చూడటానికి మరింత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. థియేటర్లో నచ్చని సినిమా ఓటీటీలో దూసుకెళ్లడం ఏంటో! థియేటర్లో కూడా ఆడితేనే కదా సినిమాను నిర్మించిన నిర్మాతలకు లాభం. సినిమా హిట్ అయితేనే కదా తీసిన మేకర్స్ కు పేరొచ్చేది. సో.. ఆడియన్స్.. కాస్తా థియేటర్స్ వైపు కూడా లుక్కిస్తే బాగుంటుంది.
అయితే, చౌర్య పాఠం అంటే దొంగతనం ఎలా చేయాలనే ట్రిక్కులు నేర్పడం కాదు.. అనుకోకుండా దొంగతనం చేయాల్సి వస్తే, ఆ ప్రయత్నంలో నేర్చుకునే గుణపాఠం.
#ChauryaPaatham – now trending in India on @primevideoin
— Prakash Mahadevan (@PrakashMahadev) May 31, 2025
!
➡️ https://t.co/LsTxDo6UWi pic.twitter.com/4GQWB81CCN
కథేంటంటే:
హీరోగా నటించిన ఇంద్రరామ్ దర్శకుడు అవ్వాలనే కలలు కంటాడు. కానీ, అతనితో సినిమాలు తీయడానికి నిర్మాతలెవ్వరూ ముందుకు రారు. ఇక ఎలాగైనా సినిమా తీయాలనే సంకల్పంతో ఉంటాడు. అలా ధనపాలి అనే ఊరు ఆదర్శగ్రామంగా అవార్డులు అందుకుంటుంది. ఎలాగైనా ఈ ఊరిలోని గ్రామీణ బ్యాంకును దోచుకోవాలని ప్లాన్ వేస్తాడు.
అందుకు తనతో పాటు ఓ ముగ్గురి స్నేహితులు కూడా చేయి కలుపుతారు. ఈ క్రమంలో రాబరీ ప్లాన్‌లోకి అదే బ్యాంకు ఎంప్లాయ్ అంజలి (పాయల్ రాధాకృష్ణ) కూడా చేరుతుంది. ఇక తాము ఉంటున్న ఓ స్కూల్ బిల్డింగ్ నుంచి బ్యాంకు లోపలికి సొరంగం తవ్వాలనే క్రిటికల్ ప్లాన్ తో ఓ స్కెచ్ వేస్తారు. అపుడు వారు పన్నిన వ్యూహంతో రాబరీ ప్లాన్ సక్సెస్ అయ్యిందా? చివరికి డైరెక్టర్ అయ్యాడా? ఈ ఊరి సర్పంచ్ క్యారెక్టర్ ఎలాంటిది? ధనపాళి ప్రజలు చివరికి వీరిని ఎలా చూశారు? అనేది మిగతా కథ.