రివ్యూ: చావు కబురు చల్లగా

V6 Velugu Posted on Mar 19, 2021

కథేంటి?

బాలరాజు (కార్తికేయ) శవాలు మోసే వ్యాన్ తోలుతుంటాడు.రోజు సమాధి,శవాలు చూసి తనకు బోర్ కొడుతుంటది.ఓ రోజు తన భర్త చనిపోయి ఏడుస్తున్న మల్లిక (లావణ్య)ను చూసి లవ్ లో పడిపోతాడు.అంత్యక్రియల్లోనే ఐ లవ్ యూ చెబుతాడు.అది చూసి ఆమె,వాళ్ల బంధువులు షాక్ అవుతారు.అప్పటి నుంచి తన వెంట పడుతుంటాడు.తనను పెళ్లి చేసుకొని లైఫ్ ఇస్తాను టార్చర్ పెడతాడు. చివరికి ఆ అమ్మాయి ఏం చేసింది.ఇతన్ని పెళ్లి చేసుకుందా లేదా అనేది కథ.

నటనటుల పర్ఫార్మెన్స్ - యంగ్ హీరో కార్తికేయ నటుడిగా పరిణితి చెందాడు. డిఫరెంట్ క్యారెక్టర్ ను ఎనర్జిటిక్ గా పర్ఫార్మ్ చేసి మెప్పించాడు.లావణ్య త్రిపాఠి కి మంచి పాత్ర లభించింది.బాధ గా ఉండే పాత్రలో ఒదిగిపోయి నటించింది.ఆమని క్యారెక్టర్ కాస్త బోల్డ్ గా ఉంది.ఆమె తన పాత్రకు న్యాయం చేసింది.మురళీ శర్మ శ్రీకాంత్ అయ్యర్ లు కూడా బాగా చేసారు.భద్రం,రంగస్థలం మహేష్ లు నవ్వించడానికి ట్రై చేశారు.

టెక్నికల్ వర్క్: కరమ్ చావ్లా సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. జేక్స్ బిజోయ్ ఇచ్చిన పాటల్లో ఒకట్రెండు బాగున్నాయి.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎడిటింగ్ ఫర్వాలేదు. కొత్త డైరెక్టర్ కౌశిక్ రాసుకున్న డైలాగులు కొన్ని బాగా వున్నాయి.

విశ్లేషణ: ‘‘చావు కబురు చల్లగా’’ ఓ డిఫరెంట్ పాయింట్ తో తెరకెక్కింది. పాయింట్ కొత్తగా చెప్పాలనుకున్నా కానీ..డైరెక్టర్ సరిగా కన్వే చేయలేకపోయాడు.అందుకే మిస్ ఫైర్ అయింది. ఇంత బోల్డ్ ఉన్న పాయింట్ ను యాక్సెప్ట్ చేయడం కష్టం.మొగుడు పోయి ఏడుస్తున్న భార్య వెంట పడటం అనే పాయింట్ పెద్దగా ఎక్కదు.అందుకే ఫస్ట్ 15 నిమిషాలకే ఆడియన్స్ డిస్కనెక్ట్ అవుతారు. డైరెక్టర్ కామెడీ తో నెట్టుకురావాలనుకున్నాడు అది కూడ పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. సెకండాఫ్ మొదలైన తర్వాత ఫర్వాలేదనిపించినా.. ప్రీ క్లైమాక్స్ ,క్లైమాక్స్ పెద్దగా ఆకట్టుకోలేదు.కొత్త డైరెక్టర్ స్క్రీన్ ప్లే సరిగా రాసుకోలేదు.కన్వీన్సింగ్ గా చెప్పలేకపోయాడు. అక్కడక్కడా కొత కామెడీ,కార్తికేయ,లావణ్యల నటన లు ఫర్వాలేదనిపించినా.. ఆ డిఫరెంట్ పాయింట్ కన్వీన్సింగ్ గా అనిపించదు.

బాటమ్ లైన్: చావు కబురు నీరసంగా

Latest Videos

Subscribe Now

More News