రూ. 50 వేలు కడితే తులం బంగారం ఇప్పిస్తమని .. రూ. 4 కోట్లు కాజేశిన్రు

రూ. 50 వేలు కడితే తులం బంగారం ఇప్పిస్తమని ..  రూ. 4 కోట్లు కాజేశిన్రు

తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామంటూ కోట్లు కొల్లగొట్టేశారు కేటుగాళ్లు. గోల్డ్ స్కీమ్ పేరుతో బురిడీ కొట్టించి రూ. 4 కోట్లతో పరారయ్యారు.  ఈ  ఘటన హైదరాబాద్ లోని రామంతాపూర్ లో చోటుచేసుకుంది. తమ స్కీమ్ లో రూ. 50 వేల రూపాయలు కట్టి చేరితే  బంగారం మార్కెట్ రేట్ కంటే 10 శాతం తక్కువకు ఇస్తామని నమ్మించారు.

వీరి మాటలు నమ్మిన దగ్గరి బంధువులు, స్నేహితులు అమాయకుల నుంచి డబ్బులు కాజేశారు. అ తరువాత టైమ్ చూసుకుని కేటుగాళ్లు జంప్ అయ్యారు కాజేసిన డబ్బులతో పారిపోయి బయట లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు. బాధితులు సీసీఎస్ లో ఫిర్యాదు చేశారు. నిందితులను విశాల్, వినయ్, నిఖిల్ గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.