తిరుమల చరిత్రలో తొలిసారి.. చిరుత దాడిలో ఎనిమిదేండ్ల చిన్నారి మృతి

తిరుమల చరిత్రలో తొలిసారి.. చిరుత దాడిలో  ఎనిమిదేండ్ల చిన్నారి మృతి

ఏపీ  తిరుమల కొండపై తీవ్ర విషాదం నెలకొంది.  అలిపిరి నడకమార్గంలో చిరుత దాడిలో ఎనిమిదేండ్ల బాలిక చనిపోయింది. ఆగస్టు 11  వారం రాత్రి 8 గంటల టైంలో చిన్నారి లక్షిత కుటుంబ సభ్యులతో కలిసి కాలినడకన కొండకు వెళ్తున్నారు. ఇదే టైంలో ముందు వెళ్తున్న చిన్నారిపై అడవిలో నుంచి వచ్చిన చిరుత ఒక్కసారిగా దాడి చేసింది. పాప పేరంట్స్ భయంతో గట్టిగా అరవడంతో అడవిలోకి ఈడ్చుకెళ్లింది. 

చిరుత దాడి ఘటనపై చిన్నారి పేరంట్స్ రాత్రి 10 గంటలకు  పోలీసులకు కంప్లైంట్ చేశారు. రాత్రి టైం కావడంతో... గాలింపు చర్యలకు ఇబ్బంది కలిగింది. ఉదయం లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సమీపంలోనే బాలిక డెడ్ బాడీని గుర్తించారు పోలీసులు. అప్పటికే చిన్నారి బాడీని చిరుత సగం వరకు తిన్నట్టు గుర్తించారు. చిన్నారి లక్షిత స్వస్థలం నెల్లూరు జిల్లాలోని పోతిరెడ్డిపాలెం. చిన్నారి తల్లిదండ్రులు దినేష్ కుమార్, శశికళ ఇతర కుటుంబ సభ్యులు... సంతోషంగా శ్రీవారి దర్శనానికి వచ్చారు. చిరుత దాడిలో చిన్నారి మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

సరిగ్గా నెల రోజుల క్రితం ఐదేళ్ల బాబుపై అలిపిరి నడకమార్గంలోని ఇదే ప్రాంతంలో చిరుత దాడి చేసింది. ఆ ఘటనలో బాబు గాయాలతో బయటపడ్డాయి. ఇప్పుడు అదే స్థలంలో చిరుత దాడి చేయడంతో భక్తుల్లో టెన్షన్ నెలకొంది.