తాడ్వాయి పవర్ ప్లాంట్ దగ్గర చిరుత సంచారం

తాడ్వాయి పవర్ ప్లాంట్ దగ్గర చిరుత సంచారం

కామారెడ్డి జిల్లా : తాడ్వాయి కన్కల్ పవర్ ప్లాంట్ పరిసరాల్లో చిరుతపులి సంచారం నిజమేనని తేలింది. పవర్ ప్లాంట్ దగ్ధం కావడంతో ఇక్కడి నుంచి వెళ్లిపోతున్న చిరుతపులి కెమెరాలకు చిక్కింది. గతంలో ఇక్కడ చిరుతపులి సంచారం భయాందోళన రేకెత్తించింది. నక్కనో.. అడవికుక్కనో చూసి పులి అనుకుని ఉంటారన్న ప్రచారమూ జరిగింది.  పలువురికి చిరుత కనిపించిందన్న ప్రచారం నేపధ్యంలో అటవీశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. చిరుతపులి జాడ తెలుసుకునేందుకు.. వాస్తవమేనా అని నిర్ధారించుకునేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే అనూహ్యంగా పవర్ ప్లాంట్ దగ్ధం కావడంతో ఈ ప్రాంతంలో నక్కి ఉన్న చిరుత బయటకు పరుగు తీస్తున్నపుడు కెమెరాకు చిక్కింది. గతంలో భయాందోళనకు గురిచేసింది ఈ చిరుతనే అనే అనుమానాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

పెళ్లి వేడుకల్లో మందు వాడకుంటే పదివేలు బహుమతి

ఈ-మోటార్ సైకిల్ ను లాంచ్ చేసిన అటు మొబైల్ సంస్థ

పేద విద్యార్ధికి దాతల అండ.. వీ6, వెలుగు కథనానికి స్పందన

మోడల్ ఆత్మహత్య ఎఫెక్ట్: మహారాష్ట్రలో మంత్రి సంజయ్ రాథోడ్ రాజీనామా