చెఫ్​ల రికార్డ్​లు

చెఫ్​ల రికార్డ్​లు

అక్కడ అలా..

హంగేరికి చెందిన చెఫ్​ బర్నబాస్ వుజిటీ–జీసొల్నే. ఇతనికి ఆన్​ లైన్​లో గేమ్ ఆడడం అంటే చాలా ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్​తోనే గిన్నిస్ రికార్డ్ సాధించాడు. 

ఎమ్.​ఎమ్​.ఒ.ఆర్​.పి.జి. (మాసివ్​ మల్టీప్లేయర్​ ఆన్​లైన్ రోల్ – ప్లేయింగ్​ గేమ్​)లో లాంగెస్ట్ వీడియో గేమ్ మారథాన్​ 59 గంటల 20 నిమిషాలు ఆడాడు. అంటే.. దాదాపు రెండున్నర రోజులు అదేపనిగా ఈ గేమ్​ ఆడాడన్నమాట. దీంతో అంతకుముందున్న 23 గంటల 31 నిమిషాల రికార్డ్​ బ్రేక్​ చేశాడు. ఈ సాహసం చేసేటప్పుడు తన ఆటనే కాకుండా అప్పుడప్పుడు తన ఫ్రెండ్స్ ఆటలో కూడా పార్టిసిపేట్ చేశాడు. 30 గంటలు ఆడాక విసుగొచ్చేసిందట. 

45 గంటల తర్వాత హాలూసినేషన్​కి కూడా గురయ్యాడట! ఈ మొత్తం ప్రాసెస్​లో గంటకు ఐదు నిమిషాలు మాత్రమే రెస్ట్ తీసుకున్నాడట! ఆ టైంలో తినడం, నిద్రపోవడం లేదా వాష్​ రూమ్​కి వెళ్లడం వంటివి చేశాడు. ఆడేటప్పుడు అలసటగా అనిపిస్తే  కాఫీ తాగకుండా నీళ్లను మాత్రమే తాగాడు. ఈ ఫీట్ మొత్తంలో15 లీటర్ల నీళ్లు తాగాడు ఆన్​లైన్​ గేమర్​ బర్నబాస్​. 
ఇలాంటి సాహసాలు చేయడం బర్నబాస్​కు కొత్తేం కాదు. 

ఇంతకుముందు ‘వరల్డ్ ఆఫ్ వార్ క్రాఫ్ట్’ అనే గేమ్​లో పదేండ్ల నుంచి ఆడుతున్నాడు. టీనేజర్ కాబట్టి మామూలు రోజుల్లో పది గంటలు, వీకెండ్స్​లో16 గంటలు ఆడడం ఇతనికి అలవాటే. ప్రస్తుతం ఈ అటెంప్ట్​తో బర్నబాస్​ లాంగెస్ట్ ఎమ్​.ఎమ్.​ఒ.ఆర్​.పి.జి. మారథాన్​, లాంగెస్ట్ వరల్డ్ ఆఫ్​ వార్​ క్రాఫ్ట్​ మారథాన్స్​లో ఛాంపియన్​గా నిలిచాడు.   బర్నబాస్ ఈ రికార్డ్​ కోసం చేసిన ఈ అడ్వెంచర్​ మిగతా వాళ్లకు​ ఉపయోగపడుతుంది. అదెలాగంటే.. తను ఆడిన గేమ్​ అంతా లైవ్​ స్ట్రీమింగ్​ అయింది.ఈ ఫీట్ చేయడానికి వీలు కల్పించిన వెబ్ సైట్​ లైవ్​ స్ట్రీమింగ్ ద్వారా వచ్చే డబ్బును ఛారిటీ కోసం వాడాలని డిసైడ్ అయింది. 

ఇక్కడ ఇలా..

కర్ణాటకలో బెంగళూరులోని ఓ ఫుడ్ సంస్థ  ప్రపంచంలోని అతి పొడవైన దోశ తయారు చేసి రికార్డుకెక్కింది. తమ సంస్థ100వ వార్షికోత్సవంలో భాగంగా ఈ భారీ దోశను మార్చి15న తయారుచేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్​ అవుతోంది. ఈ దోశ తయారీ వీడియోను చెఫ్ రెజీ మాథ్యూ షేర్ చేశారు. దోశ తయారీలో మొత్తం 75మంది చెఫ్​లు పాల్గొన్నారు. అంతా కలిసి123 అడుగుల భారీ దోశ తయారు చేశారు. 

దాంతో ఇది ప్రపంచంలో అతి పొడవైన దోశగా రికార్డ్​కి ఎక్కింది. దీన్ని తయారుచేసిన చెఫ్​లకు గిన్నిస్ సర్టిఫికెట్ అందించారు. ఈ దోశ తయారీ కోసం110 సార్లు ట్రై చేశారట! చివరికి సక్సెస్​ అయ్యారు. పొడవాటి దోశ తయారీ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే  వేల మంది చూశారు. సోషల్​ మీడియాలో ట్రెండింగ్​లో ఉంది ఈ వీడియో.