తెలంగాణలో కెమ్ వేద రూ.150 కోట్ల పెట్టుబడి

తెలంగాణలో  కెమ్ వేద రూ.150 కోట్ల పెట్టుబడి

హైదరాబాద్, వెలుగు: తమ సంస్థ విస్తరణలో భాగంగా తెలంగాణలో లైఫ్ సైన్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని కెమ్ వేద లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైన్సెస్ ప్రకటించింది. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోమవారం శాండియాగోలోని కెమ్ వేద ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లారు. ఆ సంస్థ సీఈవో బీమారావుతో భేటీ అయ్యారు. తెలంగాణలో 8 ఎకరాల్లో 2 ప్రాంతాల్లో కెమ్ వేద విస్తరించి ఉందని, 45 మందితో ప్రారంభమైన సంస్థలో ప్రస్తుతం 450 మంది పనిచేస్తున్నారని బీమారావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారం, స్కిల్డ్ మానవ వనరుల లభ్యత వల్లే ఇది సాధ్యమైందన్నారు. సంస్థ విస్తరణలో భాగంగా మరో రూ.150 కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నామని తెలిపారు. ఇందుకు కృతజ్ఞతలు తెలిపిన కేటీఆర్.. ప్రభుత్వం తరపున అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి  జయేశ్​ రంజన్ , డైరెక్టర్ లైఫ్ సైన్సెస్ శక్తి నాగప్పన్ పాల్గొన్నారు. అంతకుముందు శాండియాగోలోని తెలంగాణ వాసులు కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఘన స్వాగతం పలికారు. శాండియాగోలో ఉన్న వాణిజ్య అవకాశాల గురించి మంత్రికి వివరించారు. 

‘స్ర్కిప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ సభ్యులతో మీటింగ్
హైదరాబాద్ ఫార్మా సిటీలో ఏర్పాటు చేయబోయే ఫార్మా యూనివర్సిటీలో భాగం కావాలని ప్రఖ్యాత పరిశోధన సంస్థ స్క్రిప్స్ ను మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోరారు. స్క్రిప్స్ పరిపాలక సభ్యులైన డా.జేమ్స్ విలియమ్సన్, మేరీవాంగ్, డాక్టర్ అర్నాబ్ ఛటర్జీ, ప్రొఫెసర్ సుమిత్ చందాతో ఆయన సమావేశమయ్యారు. ఫార్మాసిటీ వివరాలను వారికి వివరించారు. అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ లో కార్యాలయాలు ఏర్పాటుచేయడం, ఫార్మా రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతలను చెప్పారు. స్క్రిప్స్ పరిశోధన సంస్థతో తెలంగాణ ప్రభుత్వం కోరుకుంటున్న భాగస్వామ్య విధానంపై చర్చించారు. కేటీఆర్ ప్రజెంటేషన్ పై స్క్రిప్స్ బృందం ఆసక్తి కనబర్చిందని మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. భాగస్వామ్యంపై త్వరలోనే చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు పేర్కొంది.