వరద నీటిలోకి డేంజర్​కెమికల్స్​ వదులుతున్నరు

వరద నీటిలోకి డేంజర్​కెమికల్స్​ వదులుతున్నరు

రామచంద్రాపురం, వెలుగు: ఇప్పటి దాకా కాలుష్య కాటుకు దూరంగా ఉన్న ఇక్రిశాట్​ను కెమికల్​ వేస్టేజ్​ చేరుతోంది. ఇటీవలే పడిన వానకు వచ్చిన వరద నీటితో కెమికల్స్​ వేస్టేజ్​ చేరి ఇక్రిశాట్ ​చెరువును కలుషితం చేసింది. ఈచెరువులోకి వరద నీటిని తీసుకువచ్చే తెల్లపూర్​కాల్వలోకి కెమికల్స్​ వేస్టేజ్​ డంప్​చేయడంతో చెరువులో చేపలు మృతిచెందాయి. ఈ ఘటన ఇక్రిశాట్​పేరును మసకబార్చేలా ఉంది. దీంతో పీసీబీ, ఎన్విరాన్​మెంటల్​ఆఫీసర్లు, సైంటిస్టులు గుట్టుచప్పుడు కాకుండా ఎంక్వైరీ చేస్తున్నారు. 

 సిటీలో వాన పడిందంటే కెమికల్​మాఫియా పండుగ చేసుకుంటోంది. తమ కంపెనీల్లోని కెమికల్​వేస్ట్​ను గుట్టుచప్పుడు కాకుండా వరద నీటిలోకి, కాలువల్లోకి వదులుతున్నారు. ఈ మాఫియా ఆగడాలతో ప్రమాదకరమైన కెమికల్స్​చెరువులు, కుంటలతో పాటు గ్రౌండ్ వాటర్​లో చేరి కలుషితం చేస్తున్నాయి. తద్వారా జనం రోగాల బారిన పడుతుండగా, మూగజీవాలు చనిపోతున్నాయి.  

రూల్స్​ బేఖాతర్​

పరిశ్రమల్లోని కెమికల్ వేస్ట్​ను ట్రీట్​మెంట్ ప్లాంట్లకు పంపాలనే రూల్స్​ఉండగా వాటిని బేఖాతర్​చేస్తున్నాయి కంపెనీ మేనేజ్​మెంట్లు. డేంజరస్​ కెమికల్స్​ను గుట్టుచప్పుడు కాకుండా రోడ్లపై పారబోస్తున్నారు. ముఖ్యంగా వర్షం కురవడాన్ని అవకాశంగా తీసుకొని  కెమికల్ వేస్ట్​ను పెద్ద పెద్ద ట్యాంకర్లలో తీసుకొచ్చి నిర్మానుష్య ప్రాంతాల్లో పారబోస్తున్నారు. నాలుగురోజుల క్రితం పటాన్​చెరు సెగ్మెంట్లో కురిసిన భారీ వర్షానికి కెమికల్​ మాఫియా రెచ్చిపోయింది. తెల్లాపూర్​ పరిధిలోని కల్వర్టు వద్ద అర్ధరాత్రి జరిపిన కెమికల్​ డంపింగ్ చాలా ఘోరానికి దారి తీసింది. ఆ కల్వర్టు ద్వారా ప్రవహించిన కెమికల్​ వేస్ట్​ పక్కనే ఉన్న ఇక్రిశాట్​ చెరువులో కలిసి వేలాది చేపలు చనిపోయాయి. ఇక్రిశాట్​కు కూడా కెమికల్​సెగ తగలడంతో ఉన్నత స్థాయి అధికారులు ఈ విషయాన్ని సీరియస్​గా తీసుకున్నారు. పీసీబీ, ఎన్విరాన్​మెంట్​ అఫీసర్లకు కంప్లైట్​ చేయడంతో బుధవారం గుట్టుచప్పుడు కాకండా విచారణ చేపట్టారు. ఈఈ సురేశ్​ బాబు, ఏఈఎస్ సురేశ్​ ఇక్రిశాట్ చెరువు, కెమికల్​ డంప్​ చేసిన ఏరియాలను పరిశీలించారు. 

అధికారులకు తెలిసే జరుగుతుందా? 

కెమికల్​ వేస్ట్​ డంపింగ్ వ్యవహారాలన్నీ స్థానిక, జిల్లా అధికారులకు తెలిసే జరుగుతోందనే మాట బలంగా వినిపిస్తోంది. ఆయా కెమికల్ ఇండస్ర్టీలలోని వేస్టేజ్ జీడిమెట్లోని ట్రీట్​మెంట్ ప్లాంటుకు తరలించాల్సి ఉండగా ఇలా దొంగల్లా ఎందుకు పారబోస్తున్నారనే ప్రశ్నకు పర్యావరణవేత్తలు విస్తుపోయే వివరణ ఇస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తయారు చేస్తున్న కెమికల్​ ప్రొడక్స్ట్​వల్ల డేంజర్​కెమికల్స్​రిలీజ్​అవుతున్నాయి. వాటిని రూల్స్​ప్రకారం ట్రీట్​మెంట్ ప్లాంటుకు తీసుకెళ్లే వీలులేకపోవడంతోనే ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. పీసీబీ, పర్యావరణ ఆఫీసర్లు కెమికల్​ ఫ్యాక్టరీలలో శాంపిల్స్ సేకరించేటప్పుడు గోల్​మాల్​ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ జేబులు నింపుకోవడానికి ఇలాంటి వ్యవహారాలను చూసీచూడనట్లు వదిలేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఉదాసీనత వల్ల మూగజీవాల మృతితోపాటు గ్రౌండ్​వాటర్​కలుషితమవుతోందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.