ఒడిశాలో ఘరో ప్రమాదం జరిగింది. ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలోని జఖాపురా స్టేషన్ సమీపంలో చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. దీంతో మూడు బోగీలు పట్టాలు తప్పాయి.
ఈ సంఘటన ఫిబ్రవరి 5న ఉదయం 8గంటల51 నిమిషాలకు జరిగింది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. వెంటనే స్పందించిన రైల్వే అధికారులు భద్రక్ నుంచి ప్రమాద స్థలానికి ఒక రెస్క్యూ టీమ్‌ను పంపించారు. సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు
