సూర్యగ్రహణంతో కరోనా చచ్చిపోతుందన్న సైంటిస్ట్ : వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెబుతుందంటే

సూర్యగ్రహణంతో  కరోనా చచ్చిపోతుందన్న సైంటిస్ట్  : వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెబుతుందంటే

జూన్ 21 ఆదివారం అంటే రేపే . భారత్ లో సూర్యగ్రహణం పట్టే రోజు. రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలిచే సూర్య గ్రహణం అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే సూర్య గ్రహణం జరిగే సమయంలో సూర్యుడి చుట్టూ 30సెకన్లపాటు కాంతి వికసిస్తుంది. ఆ కాంతి వల్ల వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయని నమ్మకం. ఆ నమ్మకంతోనే భారతీయులు గూగుల్ లో సూర్య గ్రహణంతో కరోనా వైరస్ చచ్చిపోతుందా అని వెతుకుతున్నారు. అలా వెతికే వారి సంఖ్య గంటల వ్యవధిలో పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది.

సూర్యగ్రహణానికి కరోనా వైరస్ కి సంబంధం ఏంటీ..?

2019 డిసెంబర్ 26న వాతావరణంలో జరిగిన మార్పుల వల్ల ఏర్పడిన సూర్యగ్రహణానికి కరోనా వైరస్ కు సంబంధం ఉందని అంటున్నారు చెన్నైకి చెందిన న్యూ క్లియర్, ఎర్త్ సైంటిస్ట్ డాక్టర్ కేఎల్ సుందర్ కృష్ణ. సైంటిస్ట్ కృష్ణ మాట్లాడుతూ విచ్ఛిత్తి శక్తి కారణంగా సూర్యగ్రహణం తరువాత విడుదలయ్యే న్యూ ట్రాన్ల కణ సంఘర్షణ ఫలితంగా కరోనా వైరస్ వచ్చి ఉండొచ్చని అన్నారు. వాతావరణంలో జరిగిన ఇంటర్-ప్లానెటరీ ఫోర్స్ వల్ల  వైరస్ వచ్చిందని ఆయన ఎన్ ఐకి కి చెప్పారు. అప్పుడు న్యూ ట్రాన్లు రియాక్ట్ అవ్వడంతోనే  పైన ఆకాశంలో బయో న్యూ క్లియర్ ఇంటరాక్షన్ ఏర్పడిందని  ఈ బయో – న్యూ క్లియర్ ఇంటరాక్షన్ కారణంగా కరోనా వైరస్ ఉద్భవించిందని చెప్పారు.

ప్రచారం కొట్టేసిన డబ్ల్యూహెచ్ ఓ 

అయితే ఇదంతా తప్పుడు ప్రచారమని శాస్త్రవేత్తలు కొట్టి పడేస్తున్నారు. రేపు సూర్యుని నుంచి వచ్చే  అతినీలలోహిత కిరణాలు వల్ల ఉష్ణోగ్రత పెరగొచ్చని , అయితే కరోనా మాత్రం చావదని డబ్ల్యూహెచ్ ఓ తెలిపింది. 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుడిని నుంచి కిరణాలు భూమిని చేరేలోపే శక్తిహీనమవుతాయని, వాటి ద్వారా కరోనా పోదని అంటోంది. కరోనా వ్యాపించకుండా ఉండాలంటే మాస్క్ లు ధరించడం, చేతుల్ని శుభ్రం కడుక్కోవడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించింది.