No Bag Day : బకెట్లు, ఫ్రెషర్ కుక్కర్, షూ బాక్సులతో కాలేజీకి వెళ్తున్న విద్యార్థులు

No Bag Day : బకెట్లు, ఫ్రెషర్ కుక్కర్, షూ బాక్సులతో కాలేజీకి వెళ్తున్న విద్యార్థులు

విద్యార్థులు కళాశాలకు లేదా పాఠశాలకు మామూలుగా పుస్తకాలను బ్యాగుల్లో పెట్టుకుని వస్తారు. కానీ చెన్నైలోని ఓ కళాశాల విద్యార్థులు మాత్రం బుక్స్ ను లాండ్రీ బాస్కెట్స్ ల్లో, బకెట్లు, షూ బాక్సుల్లో పెట్టుకుని కాలేజీకి చేరుకుంటున్నారు. ఇంతకీ అక్కడ ఏం జరుగుతుంది.. ఎందుకు వారలా ఆ వస్తువులతో కళాశాలకు వెళ్తున్నారు అన్న విషయానికొస్తే..

చెన్నైలోని మహిళా క్రిస్టియన్ కాలేజీ విద్యార్థులు 'నో బ్యాగ్ డే' ను వినూత్న రీతిలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు కాలేజీకి పుస్తకాలను బ్యాగుల్లో కాకుండా బకెట్లు, వంట సామాగ్రీల్లో, లాండ్రీ బాస్కెట్స్ ల్లో, సూట్ కేసుల్లో పెట్టుకుని వచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. షేర్ చేసిన కాసేపటికే మిలియన్లలో వ్యూస్ కూడా వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. కొందరు ఈ విద్యార్థులను ప్రశంసిస్తుండగా.. మరికొందరు తమకు ప్రతి రోజూ నో బ్యాగ్ డేనే అంటూ ఫన్నీ రిప్లై ఇస్తున్నారు. 

https://www.instagram.com/p/CqAZWtNPlMS/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again