
ఐపీఎల్ లో భాగంగా జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చేపట్టనుంది. ఇప్పటి వరకూ ఆడిన ఆరు మ్యాచుల్లో… ఐదు గెలిచి 10 పాయింట్లతో చెన్నై అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ ఆడిన ఐదు మ్యాచ్ లలో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచి…రెండు పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది.