GT vs CSK: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై.. గెలిస్తే టాప్-2 కు గుజరాత్

GT vs CSK: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై.. గెలిస్తే టాప్-2 కు గుజరాత్

ఐపీఎల్ 2025 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాయి. ఆదివారం (మే 25) అహ్మదాబాద్ వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్ లో చెన్నై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే గుజరాత్ టాప్-2 లోకి అర్హత సాధిస్తుంది. దీంతో ఎలాగైనా చెన్నైని ఓడించాలనే గట్టి పట్టుదలతో కనిపిస్తుంది. మరోవైపు ఈ సీజన్ లో ఘోర ప్రదర్శన చేసిన చెన్నై.. చివరి మ్యాచ్ లో గెలిచి ఓదార్పు విజయంతో టోర్నీ నుంచి నిష్క్రమించాలని చూస్తుంది. ప్లేయింగ్ 11 విషయానికి వస్తే చెన్నై జట్టులో అశ్విన్ స్థానంలో హుడా చోటు సంపాదించాడు. మరో వైపు గుజరాత్ జట్టులో రబడా స్థానంలో కొయెట్జ్ ప్లేయింగ్ 11లోకి వచ్చాడు. 

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): 

శుభమన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, గెరాల్డ్ కోయెట్జీ, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్, అర్షద్ ఖాన్, ప్రసిద్ కృష్ణ

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI):

ఆయుష్ మ్హత్రే, డెవాన్ కాన్వే, ఉర్విల్ పటేల్, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, దీపక్ హుడా, MS ధోని(కెప్టెన్, వికెట్ కీపర్), నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్