
తొలి మ్యాచ్ లో బెంగళూరును చిత్తు చేసి.. మలి మ్యాచ్ లో ఢిల్లీని దెబ్బతీసి..మూడో మ్యాచ్ లో రాజస్థాన్‌ను రఫ్ఫాడించిన చెన్నై ఎక్స్ ప్రెస్ కు ముంబైలో బ్రేకులు పడ్డాయి. హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న ధోనీ గ్యాంగ్ కు రోహిత్ అండ్ కో చెక్ పెట్టింది. మొదట బ్యాటింగ్ లో రాణించిన ముంబై మంచి స్కోరు చేస్తే.. ఛేజింగ్ లో చెన్నై చుక్కాని ధోనీ నిరాశ పరచడంతో సీజన్‌లో తొలి ఓటమి మూటగట్టుకుంది. ఇది ముంబైకి వందో విజయం కా వడం విశేషం.
ముంబై: వరుస విజయాలతో జోరుమీదున్నడిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కుముంబై ఇండియన్స్ కళ్లెం వేసింది. బుధవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ముంబై 37 రన్స్ తేడాతో చెన్నైను చిత్తుచేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 170 రన్స్ చేసింది. సూర్యకుమార్ యాదవ్ (43 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్ తో59)హాఫ్ సెంచరీతో మెరిస్తే.. క్రునాల్ పాండ్యా (32బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ తో 42) ఆకట్టుకున్నాడు.ఆఖర్లో హార్దిక్ పాండ్యా (8 బంతుల్లో ఫోర్ , 3 సిక్సర్లతో 25 నాటౌట్ ) తనదైన ఫినిషింగ్ టచ్ తో జట్టుకు మంచి స్కోరు అందించాడు. లక్ష్య ఛేదనలో చెన్నై 20ఓవర్లలో 8 వికెట్లకు 133 రన్స్‌కే పరిమితమై ఓడింది.కేదార్ జాదవ్ (54 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్ తో 58)ఫిఫ్టీ చేసినా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమవడంతో చెన్నైకి ఓటమి తప్పలేదు. ముంబై బౌలర్లలో హార్దిక్ ,మలింగ చెరో 3, బెరెన్ డార్ఫ్ 2 వికెట్లు పడగొట్టారు.
ఆరంభంలోనే షాక్స్ ..
టార్గెట్ ఛేజింగ్ లో చెన్నైకి స్టార్టింగ్ లోనే షాక్ మీదషాక్ తగిలింది. తొలి ఓవర్‌లో రాయుడు (0) ఖాతాతెరవకుండానే గోల్డెన్ డక్‌గా వెనుదిరిగితే.. మరుసటిఓవర్‌లోనే వాట్సన్ (5) కూడా పెవిలియన్ చేరాడు.దీంతో రెండు ఓవర్లు ముగిసేసరికి చెన్నై 6/2తో కష్టాల్లో పడింది. ఈ దశలో రైనా (15 బంతుల్లో 2 ఫోర్లు,సిక్సర్ తో 16), జాదవ్ వికెట్ల పతనాన్ని అడ్డుకునేయత్నం చేశారు. బెరెన్‌డార్ఫ్ బౌలింగ్ లో 2 ఫోర్లతోటచ్ లోకొచ్చిన రైనా.. పాయింట్ వద్ద పొలార్డ్ పట్టిన కళ్లు చెదిరే క్యాచ్ కు డగౌట్ బాటపట్టాడు. ఈ దశలో జాదవ్ తో కలిసిన ధోనీ(21 బంతుల్లో 12) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో పడ్డాడు.వీరిద్దరూ అరంభంలోమరీ నెమ్మదిగా ఆడటంతో చెన్నై 10 ఓవర్లలో66/3తో నిలిచింది. అయినా ‘చెన్నై చుక్కాని’క్రీజులోఉండటంతో ఛేజింగ్ పెద్ద కష్టం అనిపించలేదు. కానీగత మ్యాచ్ లో అజేయ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నధోనీ ఈ సారి ఆ మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయాడు.జడేజా (1), బ్రావో (8) కూడా విఫలమవడంతో చాలాముందే చెన్నై ఓటమి ఖరారైది.
ఆఖర్లో అదుర్స్
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబైకు మంచి ఆరంభం దక్కలేదు. చహర్‌బౌలింగ్ లో ఫోర్ తో ఖాతా తెరిచిన డికాక్ (4) తర్వాతిబంతికే జాదవ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కెప్టెన్‌రోహిత్ శర్మ (13) టచ్ దొరక్క ఇబ్బంది పడుతుంటే..సూర్యకుమార్ మాత్రం వచ్చి రావడంతోనే రెచ్చి పోయాడు. శార్దుల్ ఓవర్ లో 2 ఫోర్లు, చహర్ ఓవర్ లోహ్యాట్రిక్ ఫోర్లతో ఫుల్ స్వింగ్ లోకి వచ్చేశాడు. దీంతో5 ఓవర్లు ముగిసేసరికి ముంబై 39/1తో నిలిచింది.ఈ దశలో చెన్నై బౌలర్లు విజృంభించడంతో వరుసగానాలుగు ఓవర్ల పాటు ఒక్క బౌండ్రీ రాకపోగా.. జడేజాబౌలింగ్ లో రోహిత్ , తాహిర్ బౌలింగ్‌లో యువరాజ్‌సింగ్ (4) ఔటయ్యారు. దీంతో 10 ఓవర్లు పూర్తయ్యే సరికి ముంబై 3 వికెట్లు కోల్పోయి 57 పరుగులేచేసింది. క్రునాల్ తో కలిసి సూర్యకుమార్ ఇన్నింగ్స్‌నుముందుకు నడిపించాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్లోగాని తొలి సిక్స్ నమోదవలేదంటే ముం బై ఇన్నింగ్స్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఎట్టకేలకు16వ ఓవర్లో స్కోరు 100 దాటింది. మోహిత్ శర్మబౌలింగ్ లో రెండు ఫోర్లు కొట్టిన క్రునాల్ మరో భారీషాట్ కు యత్నించి జడేజాకు చిక్కితే.. హాఫ్ సెంచరీపూర్తి చేసుకున్న సూర్యకుమార్ ను బ్రావో బోల్తా కొట్టించాడు. అప్పటికి ముం బై స్కోరు 125/5. మరో 2ఓవర్లు మాత్రమే ఉండటంతో ముంబై మహా అయితే150 చేస్తుం దనుకుంటే.. ఆఖర్లో పొలార్డ్ (7 బంతుల్లో2 సిక్సర్లతో 17 నాటౌట్ )తో కలిసి ‘కుంగ్‌ఫూ పాండ్యా విజృంభించడంతో ముంబై మంచి స్కోర్ చేయగలిగింది.డార్ఫ్