
చెన్నై: పంజాబ్ పై చెన్నై విజయం సాధించింది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో పంజాబ్ పై 22 పరుగులతో విజయం సాధించింది చెన్నై. 161 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 138 పరుగులు మాత్రమే చేసింది. పంజాబ్ బ్యాటింగ్ లో లోకేష్ రాహుల్ 55, సర్పరాజ్ ఖాన్ 67, తప్ప మిగతా వారందరూ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. లాస్ట్ ఓవర్‌లో 25 పరుగులు అవసరం కాగా పంజాబ్ 3 పరుగులు మాత్రమే చేసింది. దీంతో చెన్నై 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. చెన్నైకి ఇది నాలుగో విజయం . పాయింట్ల టేబుల్ లో ఫస్ట్ ప్లేస్ కు వెళ్లింది చెన్నై.
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన చెన్నై 20 ఓవర్లలో మూడు వికెట్ల కోల్పోయి 160 పరుగులు చేసింది. డుప్లెసిస్ 54, ధోని 37 , వాట్సన్ 26, సురేష్ రైనా 17,రాయుడు 21 పరుగులు చేయడంతో చెన్నై 161 రన్స్ టార్గెట్ ను పంజాబ్ ముందు ఉంచింది.