
రెజీనా కసాండ్రా(Regina Cassandra)..తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. సుధీర్ బాబు హీరోగా వచ్చిన ఎస్ఎమ్ఎస్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఈ సినిమాలో తన అందం, అభినయంతో కుర్రాళ్లకు కునుకులేకుండా చేసింది. ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా.. రెజీనాకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.
ఆ తరువాత కూడా మంచి అవకాశాలే దక్కించుకుంది ఈ బ్యూటీ. మెగా హీరో సాయిధరమ్ తేజ్ తో చేసిన పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలతో మంచి హిట్ అందుకుంది. అయితే ఈ సినిమాలతో వచ్చిన విజయాన్ని కూడా నిలుపుకోలేపోయింది రెజీనా.
అయితే కొంతకాలంగా పెద్దగా సినిమా అవకాశాలు దక్కించుకొని రెజీనా.. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ఆచార్య సినిమాలో స్పెషల్ సాంగ్ లో అలరించింది. కానీ, ఈ సినిమా కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ చెన్నై బ్యూటీ రెజీనా షెడ్యూల్ ఎంత బిజీగా ఉందో తెలిస్తే ఆడియన్స్ స్టన్ అవ్వాల్సిందే. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఆరు సినిమాలు ఉన్నాయి.
తమిళ్, తెలుగు,హిందీలో ఇలా భాషతో సంబంధం లేకుండా..వచ్చిన ప్రతి కంటెంట్ ఫిల్మ్ ని అందిపుచ్చుకుంటోంది. అయితే వీటిలో 'ఉత్సవం' అనే తెలుగు సినిమా ఒకటి ఉంది. కానీ ఇది డిలే అవుతోన్న ప్రాజెక్ట్. దాంతో సంబంధం లేకుండా రెజీనా మిగతా సినిమాలతో బిజీగా ఉంది. దాదాపు 17 ఏళ్లగా ఇండస్ట్రీలో ఉంటున్న..తన గ్లామర్ ని కంటిన్యూ చేస్తూ వస్తోంది.
తాజాగా ఈ బ్యూటీ బ్లూ కలర్ సారీలో తళుక్కుమన్నది. బ్లూ కలర్ సారీకి తగ్గ మ్యాచింగ్ రవిక ధరించి అలా బీచ్ లో వయ్యారాల వాక్ చుస్తుంటే! కుర్రాళ్ల హృదయాలు జారిపోతున్నాయి. అయితే, రెజీనా ఈ కలర్ చీర ధరించడానికి ఇక్కడో స్పెషాలిటీ ఉంది.
బీచ్ లో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో భాగంగా..అక్కడ బీచ్ లో ఉన్న చెత్తా చెదారం చేతికి గ్లౌవ్స్ వేసుకుని క్లీన్ చేస్తోంది ఈ అమ్మడు. ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వాలు బీచ్ క్లీన్ కార్యక్రమాలు చేపట్టిన సంగతి అందరికి తెలిసిందే. దీనిలో భాగంగా సోషల్ అవేర్ నెస్ లో భాగంగా సెలబ్రిటీలు సైతం నేరుగా క్లిన్ చేసే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇక తాజాగా రెజీనా వంతు రావడంతో బీచ్ లో ప్రత్యేకమైన చీరను ధరించి తనను తాను ప్రమోట్ చేసుకుంటూనే బీచ్ ని క్లీన్ చేసింది చెన్నై బ్యూటీ రెజీనా..దీంతో రెజీనా ఫ్యాన్స్ సూపర్..మేము సైతం అంటూ కామెంట్స్ పెడుతున్నారు.