రాష్ట్రంలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆరే సూత్రధారి అని..ఫోన్ ట్యాపింగ్ చేయించిందే కేసీఆర్ అని చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈ కేసులో అరెస్టయిన రాధాకిషన్ అన్ని విషయాలు విచారణలో చెప్పారని..అధికారంలో ఉండి కేసీఆర్ అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు కనిపించకుండా ధ్వంసం చేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్ మామూలు కేసు కాదు.. అది కేసీఆర్ మెడకు చుట్టుకుంటదని అన్నారు వివేక్ వెంకటస్వామి.
మరోవైపు కాళేశ్వరం పేరుతో కోట్ల రూపాయాలు కేసీఆర్ దోచుకున్నారని అన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ప్రస్టేషన్ లో ఉండి ఏదేదో మాట్లడుతున్నారని విమర్శించాురు. లిక్కర్ స్కాం లో బిడ్డ కవిత జైలు వెళ్లింది. ఆమె చేసింది తప్పని తెలుసు.. అందుకే ఆ విషయంలో కేసీఆర్ మాట్లాడ్డం లేదని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు.