భారత్ న్యాయ్ యాత్రలో పాల్గొన్న సీఎం రేవంత్,ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

భారత్ న్యాయ్ యాత్రలో పాల్గొన్న  సీఎం రేవంత్,ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ న్యాయ్ యాత్ర కాసేపటి క్రితమే ప్రారంభమయ్యింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ జెండ ఊపి యాత్రను ప్రారంభించారు. మణిపూర్ లోని తౌబాల్ నుంచి భారత్ జోడో న్యాయ్ యాత్ర జరగనుంది. పలు రాష్ట్రాల సీఎంలు, కాంగ్రెస్  నేతలు పాల్గొన్నారు.  ఈ యాత్ర 110 జిల్లాల గుండా 67 రోజుల పాటు.. 6 వేల 700 కిలోమీటర్లు కొనసాగనుంది. ముంబైలో ఈ యాత్ర ముగియనుంది. 

భారత్  న్యాయ్ యాత్రకు  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కూడా హజరయ్యారు. 

భారత్ జోడో న్యాయ్ యాత్ర దేశరాజకీయాలకు ఒక పరివర్తన క్షణమన్నారు జైరామ్ రమేశ్. గతంలో చేసిన పాదయాత్ర పార్టీలో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పారు. ఈ పాదయాత్ర కొనసాగింపే న్యాయ్ యాత్ర చేపడుతున్నామన్నారు. ఈ ప్రయాణం మణిపూర్ నుంచి ముంబై వరకు ఉంటుందని.. ముంబైలో ముగింపు సభ ఉంటుందన్నారు జైరామ్ రమేశ్.