కాళేశ్వరం... ప్రజాధనం.. దుర్వినియోగం: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామి

కాళేశ్వరం... ప్రజాధనం.. దుర్వినియోగం: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామి

కాళేశ్వరం ప్రాజెక్ట్​ నుంచి ఇంతవరకు రెండు టీఎంసీల పనే పూర్తి కాలేదని... కాని మూడో టీఎంసీకి గత ప్రభుత్వం అనవసరంగా ఖర్చు చేసిందని  చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి అన్నారు.  గత ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం  చేసిందన్నారు.    నేషనల్​ డేమ్​ సేఫ్టీ రిపోర్టులో కాళేశ్వరం ప్రాజెక్ట్​ డిజైన్​లోనే లోపాలున్నాయని పేర్కొందన్నారు. తన నియోజకవర్గంలో మేడిగడ్డ బ్యారేజ్​ బ్యాక్​ వాటర్​సమస్య ఉందన్నారు.  నష్ట పోయిన వారికి గత ప్రభుత్వం పరిహారం ఇవ్వలేదన్నారు.వచ్చే వర్షాకాలం లోపు ఈ ప్రాంత ప్రజల సమస్యలను పరిష్కరించాలని మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డిని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి కోరారు.