ఐటీ, ఈడీ రెయిడ్స్లో రెండే చిప్పలు దొరికాయి.. ఒకటి కేసీఆర్కు, ఇంకోటి బాల్క సుమన్కు : వివేక్ సరోజ

ఐటీ, ఈడీ రెయిడ్స్లో రెండే చిప్పలు దొరికాయి.. ఒకటి కేసీఆర్కు, ఇంకోటి బాల్క సుమన్కు : వివేక్ సరోజ
  • ఐటీ, ఈడీ రెయిడ్స్ చేయిస్తే రెండే చిప్పలు దొరికినై 
  • ఒకటి కేసీఆర్ కు, ఇంకోటి బాల్క సుమన్ కు
  • ఓడినంక ఓ బావిలో దూకుతావో ప్లాన్ చేస్కో
  • చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి సతీమణి సరోజ

కోల్ బెల్ట్ :  ‘బాల్క సుమన్ అనే మూర్ఖుడు మా ఇంటిపై ఐటీ, ఈడీ రెయిడ్స్ చేయించిండు.  అధికారుల సోదాల్లో రెండే చిప్పలు దొరికినై. ఒకటి కేసీఆర్ కు, ఇంకోటి బాల్క సుమన్ తీసుకోవాలి’ అంటూ చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి సతీమణి సరోజ ఎద్దేవా  చేశారు. వివేక్ వెంకటస్వామి తరపున మంచిర్యాల జిల్లా మందమర్రిలోని రాజీవ్ నగర్, శాంతినగర్​లో జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మితో కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా సరోజ బాల్క సుమన్​పై విరుచుకుపడ్డారు.

‘చెన్నూరు నియోజకవర్గంలో కాకా కుటుంబం వేసిన రోడ్లే ఇప్పటికీ ఉన్నాయి. కొత్తవి ఏసింది లేదు. వంద కేసులంటూ నమ్మబలికి వెయ్యి కోట్లు దండుకున్న వాడివైపు ఉంటారా.. ప్రజాసేవకు వచ్చిన వివేక్ వైపు ఉంటారా? ప్రజలే నిర్ణయించుకోవాలి. పదేండ్లు కుంభకర్ణుడులాగా తిని పడుకున్నావ్.  ఇప్పుడు మల్లా ఓట్ల కోసం నిద్ర లేసినవ్. బాల్క సుమన్ ఓట్లు అడగడానికి వస్తే చీపురుతో కొట్టేందుకు ప్రజలు  సిద్ధంగా ఉన్నరు. సుమన్ ను ఇప్పుడు అడుగుతున్నం. వెయ్యి కోట్లు ఏడికెళ్లి సంపాదించినవ్.  ఎన్నికల్లో ఓడి డిసెంబర్ 3 తర్వాత ఏ బావిలో దూకుతావో పోయి ప్లాన్ చేస్కో సుమన్’ అంటూ మండిపడ్డారు. ఈసందర్భంగా రాజీవ్ నగర్ కు చెందిన 50 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. గడ్డం సరోజ, నల్లాల భాగ్యలక్ష్మి వారికి హస్తం కండువా కప్పిపార్టీలోకి ఆహ్వానించారు.