కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో.. ఇంకా బానిసలుగా బతుకుతున్నాం : సరోజావివేక్

కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో.. ఇంకా బానిసలుగా బతుకుతున్నాం : సరోజావివేక్

12వందల మంది విద్యార్థులు ప్రాణత్యాగం చేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇంకా బానిసలుగా బతుకుతున్నాం.. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అయినా బంగారు తెలంగాణ కాలేదు.. మట్టిపాలైందని విమర్శించారు చెన్నూరు కాంగ్రెస్  అభ్యర్థి వివేకవెంకటస్వామి సతీమణి సరోజావివేక్ అన్నారు. చెన్నూరు నియోజకవర్గంలోని మందమర్రి మండలం రామకృష్ణాపూర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు సరోజావివేక్. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్ ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినాయకుడిగా ఉండి ఉద్యో్గాలు వస్తాయని యువతకు మభ్య పెట్టాడని ఆరోపించారు. ఉద్యోగాల కోసం ప్రశ్నిస్తే.. మహిళలు అని చూడకుండా దాడులు చేస్తున్నాడని అన్నారు. యువతపై అక్రమంగా కేసులు పెడుతున్నాడని విమర్శించారు. 

గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కొత్త హమీలతో ఓట్లు అడిగేందుకు బాల్క్ సుమన్ వస్తున్నాడు.. తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు సరోజావివేక్. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఇంకా మనం బానిసలుగానే బతకాల్సి వస్తుందని అన్నారు సరోజావివేక్. ఉద్యోగాలకోసం అప్లికేషన్ల రూపంతో నిరుద్యోగ యువతనుంచి వందలకోట్లు దోచుకున్నారని ఆరోపించారు. పేపర్ లీకులు చేసి విద్యార్థులు, నిరుద్యోగ యువత జీవితాలతో ఆడుకున్నారని విమర్శించారు సరోజావివేక్. 

పైసలు ఇస్తే ఓట్లు వేస్తరు.. మద్యం పోసి ఓట్లు వేయించుకొని గెలవాలనే ధీమాతో బీఆర్ ఎస్ నేతలు ఉన్నారు.. మీ పిల్లల భవిష్యత్ బాగుపడాలంటే.. కాంగ్రెస్ ఓటేసి గెలిపించాలని కోరారు చెన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి వివేక్ వెంకట్ స్వామి సతీమణి సరోజావివేక్.