టీఆర్ఎస్లోకి నల్లాల ఓదేలు..కేసీఆర్ తో భేటీ

 టీఆర్ఎస్లోకి నల్లాల ఓదేలు..కేసీఆర్ తో భేటీ

చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు టీఆర్ఎస్లో చేరనున్నట్లు తెలుస్తోంది. మంగళవారం రాత్రి  సీఎం కేసీఆర్ తో ఓదేలు దంపతులు భేటీ అయ్యారు. కార్పోరేషన్ చైర్మన్ పదవి ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆయన టీఆర్ఎస్లో చేరుతున్నట్లు సమాచారం. మధ్యాహ్నం జరిగే టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో ఆయన టీఆర్ఎస్లో చేరుతారని తెలుస్తోంది. 

ఇటీవలె నల్లాల ఓదేలు దంపతులు కాంగ్రెస్లో చేరారు. టీఆర్ఎస్లో తమకు తగిన ప్రాధాన్యం లభించడం లేదంటూ వారు హస్తం కండువా కప్పుకున్నారు. అయితే కొన్ని రోజుల్లోనే తిరిగి టీఆర్ఎస్లో చేరుతుండడం గమనార్హం.