రైతుల సంక్షేమానికి వివేక్ వెంకటస్వామి​ కృషి

రైతుల సంక్షేమానికి వివేక్ వెంకటస్వామి​ కృషి
  • ఎమ్మెల్యేకు స్వాగతం పలికిన లీడర్లు 

కోల్​బెల్ట్, వెలుగు: పది రోజుల పాటు విదేశీ పర్యటన ముగించుకొని మంగళవారం హైదరాబాద్ చేరుకున్న చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ ​వెంకటస్వామికి నియోజకవర్గ కాంగ్రెస్ ​లీడర్లు ఘనస్వాగతం పలికారు. అఖిల భారత యాదవ సంఘం మంచిర్యాల అధ్యక్షుడు, కాంగ్రెస్ ​లీడర్ ​బండి సదానందం అనుచరులతో కలిసి శంషాబాద్​ఎయిర్​పోర్ట్​లో ఎమ్మెల్యే వివేక్​కు స్వాగతం పలికారు.

 శాలువా కప్పి బొకే అందజేశారు. ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా, రైతుల సంక్షేమం కోసం వివేక్​ వెంకటస్వామి కృషి చేస్తున్నారని బండి సదానందం అన్నారు. ఇటీవల అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగానికి చేయూతనందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, రాష్ట్ర లీడర్ ​దుర్గం నరేశ్, రఘునాథ్​రెడ్డి, వెంకటేశ్వర్లు, రవికుమార్ తదితరులున్నారు.